slot anti rungkat 2023

slot anti rungkat 2023

slot deposit dana

2023

slot deposit dana

slot gacor

“ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం” పై ఆమె సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా – Information and Public Relations Department, Government of Telangana

“ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం” పై ఆమె సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

పత్రికా ప్రకటన      తేది:01.12.2022, వనపర్తి.

హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని వైద్య అధికారులకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆదేశించారు.
గురువారం ఐ.డి. ఓ.సి. ప్రజావాణి సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో “ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం” పై ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ కలుషిత సూదుల సిరంజిల ద్వారా వ్యాప్తి చెందుతుందని, అనురక్షిత లైంగిక సంబంధాల ద్వారా, కలుషిత రక్తాన్ని ఒకరి నుండి మరొకరికి ఇవ్వటం ద్వారా, పాలు ఇచ్చే తల్లుల నుండి పుట్టిన బిడ్డకు సోకుతుందని ఆమె వివరించారు. డిస్పోజబుల్ సిరంజీలను, నిడిల్ ను ఉపయోగించాలని, గుర్తింపు పొందిన బ్లడ్ బ్యాంక్  నుండి రక్తాన్ని పొందాలని, కండోమ్ లు ఉపయోగించాలని, తగు జాగ్రత్తలు పాటించాలని ఆమె తెలిపారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.
హెచ్. ఐ.వి/ ఎయిడ్స్ భయంకరమైన వ్యాధి అని, ప్రతి గర్భిణీ స్త్రీ హెచ్. ఐ.వి. పరీక్షలు తప్పని సరిగా చేయించుకోవాలని ఆమె తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఐ.డి.టి.సి. సెంటర్లలో ఉచిత పరీక్షలు నిర్వహిస్తారని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖలో ఉత్తమ సేవలు అందించిన వారికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు, ప్రశంసా పత్రాలు అందించటం జరిగిందని ఆమె తెలిపారు. డి.ఎం.హెచ్. ఓ. డా.రవిశంకర్, డిప్యూటీ డి.ఎం.హెచ్. ఓ. డా.శ్రీనివాసులు, ప్రోగ్రాం అధికారి డా. సాయినాథ్ రెడ్డి, డా. వంశీ కృష్ణ, డా. శయనాజ్, స్టాఫ్ నర్స్, టెక్నీషియన్స్, ఎన్.సి.సి. కౌన్సిలర్స్ కు అవార్డుల ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ ఓ డాక్టర్ రవి శంకర్, ప్రోగ్రామింగ్ అధికారి డాక్టర్ సాయినాథ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దీప్తి, మెడికల్ ఆఫీసర్ చైతన్య గౌడ్, మహిళ డిగ్రీ కళాశాల ఎన్ ఎస్ ఎస్ అధికారి శ్రీనివాస్, నరసింహారావు, సిబ్బంది, ఎన్జీవోలు, తదితరులు పాల్గొన్నారు.
………
అంతకు ముందు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో “ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం” ర్యాలీని జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని, ఎయిడ్స్ నివారించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, డి ఎం హెచ్ ఓ డాక్టర్ రవి శంకర్, ప్రోగ్రామింగ్ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, మాస్ మీడియా అధికారి చంద్రయ్య, మధు, బాలస్వామి, సూపర్వైజర్లు నరసింహారావు, చంద్రయ్య, బాలమని, హెచ్ఐవి కోఆర్డినేటర్ సురేందర్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు. ఎన్.సి.సి. విద్యార్థులు, జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post