*ప్రపంచ పర్యాటక,బౌద్ధ కేంద్రంగా బుద్ధవనం:రాష్ట్ర ఐ. టి.పురపాలన, పట్టణ అభివృద్ధి,పరిశ్రమల శాఖ మంత్రి కె. టి.ఆర్* *సాగర్ లో మంత్రుల తో కలిసి బుద్ధవనం ప్రారంభించిన కె.టి.ఆర్*

నాగార్జున సాగర్, మే 14. నంది కొండ లో(నాగార్జున సాగర్ ) లో ఏర్పాటు చేసిన బద్ధ వనం ను  ప్రపంచ స్థాయిలో అద్భుతంగా,ప్రముఖ బౌద్ధ క్షేత్రం గా,అన్ని హంగు లతో ఆకర్ష నీయంగా అభివృద్ధి చేయుటకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర ఐ. టి.,పురపాలన,పట్టణ అభివృద్ధి,పరిశ్రమల శాఖ మంత్రి క్రె. తారక రామారావు అన్నారు.శనివారం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో రాష్ట్ర ఐ. టి.పురపాలన,పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు బుద్ధవనం ను మంత్రుల తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బుద్ధవనం ను బుద్ధ వనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీచర్
మల్లేపల్లి లక్ష్మయ్య,కళా శిల్పి శివ నాగిరెడ్డి గారు ఈ ప్రాజక్టు కు చాలా కష్టపడ్డారని అన్నారు.
ఈ ప్రాజక్టు నిర్మాణం కోసం పని చేసిన శిల్పులు, పాలు పంచు కొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.బుద్ధవనం ను ప్రముఖ పర్యాటక కేంద్రం గా,బుద్దిస్ట్ సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తే ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని అన్నారు., పర్యాటకుల .గౌతమ బుద్ధుడు మన భారత దేశం లో పుట్టడం గర్వకారణం అన్నారు.
తెలిపారు.బుద్ధుని శిష్యులు ప్రచారం వలన బౌద్ధం చాలా దేశాలకు వ్యాపించిందని అన్నారు. ఈ ప్రాంతం లో నివసించిన ఆచార్య నాగార్జునుడు  బుద్ధుని శిస్యుడు అని అన్నారు
మన రాష్ట్రంలో చాలా చోట్ల బౌద్ధ స్థూపాలు కనిపిస్తాయి.సూర్యాపేట జిల్లా ఫణిగిరి లో,ఖమ్మం జిల్లా నేల కొండ పల్లి లో,కరీంనగర్ జిల్లా ధూళి కట్ట లో బౌద్ధ స్థూపాలు,చైత్యాలు ఉన్నాయి అన్నారు.బుద్ధుని ప్రభోధనలు పాటించక పోవడమే సమాజం లో అవ లక్షణాలకు కారణం గా పేర్కొన్నారు
బౌద్ధులు మన దేశానికి తరలి వచ్చే విధంగా బౌద్ధారామాలు తీర్చిదిద్దాలి.రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు  విజన్ కు అనుగుణంగా ఈ బుద్ధవనం ప్రాజక్టును తీర్చిదిద్ధి నట్లు తెలిపారు.
274 ఎకరాలు ఉన్న ఇక్కడ, 90 ఎకరాలను మాత్రమే ఉపయోగించుకున్నట్లు,ఇంకా అన్ని హంగులతో అభివృద్ధి చేయటానికి అవకాశం ఉందని,ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తో మాట్లాడి నిధులు కేటాయింపు మంజూరు కృషి చేస్తానని అన్నారు
ఇక్కడ బౌద్ధ యునివర్సిటీ ఏర్పాటు చేయాలని ఎవరైనా వస్తే తప్పకుండా పరిశీలిస్తాం అన్నారు.బుద్ధవనం ప్రపంచ పర్యాటక కేంద్రంగా,బుద్దిస్ట్ సర్క్యూట్ గా
పిపిపి  పద్ధతిలో అభివృద్ధి చేయటానికి ముందుకు వస్తున్నారు.ఈ దిశగా పర్యాటక శాఖ,జిల్లా యంత్రాంగం ప్రతి పాధనలు రూపొందించాలి అన్నారు.ఈ ప్రాంతం లో చాకలి గుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దాలి అన్నారు.
బౌద్ధం విస్తారంగా   అనుసరిస్తున్న దేశాల అంబాసిడర్లును,బౌద్ధ సన్యాసులు ను ఇక్కడ రప్పించి మన దగ్గర ఉన్న అవకాశాలను వారికి చూపించనున్నట్లు తెలిపారు.
 రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తో మాట్లాడి దలైలామా గారిని కూడా ఇక్కడకు రప్పించుకుందామని అన్నారు
ఫణి గిరిలో కూలిపోయిన స్థూపాలను పునః నిర్మించాలని అన్నారు
బుద్ధవనం లో
మూడు కిలో మీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్ నిర్మాణానికి  చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక ,సాంస్కృతిక ,క్రీడలు,యువజన సర్వీసులు శాఖా మంత్రి
శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ
తెలంగాణ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉందని,
సమైక్యాంధ్ర లో హైటెక్ సిటీ ఒక్కటి కట్టి మేమే అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకున్నారని అన్నారు
టూరిజం మీద ఆధారపడి చాలా దేశాలు ఉన్నాయి.కానీ మన దగ్గర ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి
సిఎం కేసీఆర్  గారు రామప్పకు యునెస్కో హోదా తెప్పించారు.
తెలంగాణ ప్రతి జిల్లాలో టూరిజం ను అభివృద్ధి చేస్తామమని అన్నారు..
ప్రాజెక్టులు కట్టిన ప్రతి ప్రదేశంలో టూరిజం ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు
సిఎం కేసీఆర్ గారి దృష్టికి తీసికెళ్ళి మరిన్న కార్యక్రమాలు  చేపట్టనున్న ట్లు తెలిపారు.
రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జి.జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక నాగార్జున సాగర్ ను తీర్చి దిద్దాలని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు తీసుకున్న శ్రద్ధ,కృషి వలన బుద్ధ వనం ప్రారంభం చేసుకోవడం జరిగిందని అన్నారు.ప్రపంచానికి మానవతా విలువలు నేర్పిన  బౌద్ధం,ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల లో ప్రపంచ పర్యాటక కేంద్రం చేయాలని బుద్ధవనం ప్రాజెక్ట్ చేపట్టి  7 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం లో
 రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక,సాంస్కృతిక, క్రీడలు,యువజన శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్ రెడ్డి, రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ,రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి కె. మల్లా రెడ్డి, రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్,జడ్.పి.చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎం.ఎల్.సి కోటి రెడ్డి, నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల భగత్,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, రాష్ట్ర పర్యాటక సంస్థ ఎం.డి.మనోహర్,బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లే పల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు
ప్రపంచ పర్యాటక,బౌద్ధ కేంద్రంగా బుద్ధవనం:రాష్ట్ర ఐ. టి.పురపాలన, పట్టణ అభివృద్ధి,పరిశ్రమల శాఖ మంత్రి కె. టి.ఆర్*
*సాగర్ లో మంత్రుల తో కలిసి బుద్ధవనం ప్రారంభించిన కె.టి.ఆర్*

Share This Post