ప్రపంచ పర్యాటక ఉత్సవాలు – 2021 (మెమోంటొ మరియు సర్టిఫికెట్ ల పంపిణీ కార్యక్రమము)

సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినోత్సవంను పురస్కరించుకుని గత సెప్టెంబర్ నెల 23 నుండి సెప్టెంబర్ 27వరకు నిర్వహించిన   ప్రపంచ పర్యాటక ఉత్సవాలలో భాగంగా తేది:23/09/2021 రోజున హెరిటేజ్ వాక్ భువనగిరి ఖిల్లా పై సుమారు 150 మందితో నిర్వహించడం జరిగింది, 24/09/2021న భువనగిరి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుండి భువనగిరి ఖిల్లా వరకు సుమారు 120 మంది తో సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది, 25/09/2021న 150 పై చిలుకు మందితో భువనగిరి ఖిల్లా వద్ద స్వచ్ఛత పఖ్వాడా నిర్వహించారు. చివరి రోజైన ఈ 27/09/2021 రోజున స్థానిక భువనగిరి ఖిల్లా వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ప్రపంచ  పర్యాటక  ఉత్సవాలల్లో భాగంగా నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాలను ఆ రోజు భారీ వర్షం కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసినదే. అట్టి బహుమతులు మరియు సర్టిఫికెట్ పంపిణీ కార్యక్రమము  తేది :23/11/2021న భువనగిరి పురపాలక సంస్థ -మీటింగ్ హాల్ లో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమములో శ్రీమతి పమేళా సత్పత్తి, ఐ.ఏ.యస్.,జిల్లాకలెక్టర్ గారు, కే.ధనంజనేయులు-జిల్లా పర్యాటక శాఖ అధికారి గారు, భువనగిరి పురపాలక కమీషనర్ పూర్ణ చందర్ గారు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేళా సత్పతి ఐ.ఏ.ఎస్. గారు మాట్లాడుతూ జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు జరపడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు.పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేయడం,వారసత్వ సంపదలను కాపాడుకోవడం,వాటిని తరువాతి తరాలకు అందించడం మనందరి భాద్యత అని గుర్తు చేశారు.ఈ సంధర్భంగా జిల్లా పర్యాటక శాఖ అధికారి గారు మాట్లాడుతూ, ముందుగా వర్షం కారణంగా వాయిదా పడిన కార్యక్రమం ఆలస్యంగా నిర్వహిస్తున్నందుకు అందరూ పెద్ద మనసు చేసుకొని అర్ధం చేసుకొని సహకరించిన ప్రతిఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు.  రానున్న రోజుల్లో జిల్లాలో ప్రాచుర్యం లోకిరాని అనేక పర్యాటక ప్రాంతాలను జోన్ ల వారిగా గుర్తించి వాటిని అధివృద్ది చేయడంలో ప్రజలు పెద్ద ఎత్తున  భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.పర్యాటకాన్ని అభివృద్ది చేయడం వల్ల స్థానికంగా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ప్రజలకు ఉపాదిమార్గం సుగమము అవుతుందని తెలియజేశారు. తద్వారా ప్రజల  ఆదాయం పెరిగి జీవన నైపుణ్యంను మెరుగుపర్చుకొనుటకు ఆస్కారం ఉంటుందని తెలిపినారు. ఈ సందర్భంగా వివిద పోటీల్లో గెలుపొందిన వారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మేమేంటో  మరియు సర్టిఫికెట్లు ప్రధానం చేయడం జరిగినది. హెరిటేజ్ వాక్ లో గెలుపొందిన వెంకటేష్ (ప్రథమ బహుమతి), బి. రాజశేఖర్ (ద్వితీయ బహుమతి),అన్విత రెడ్డి (తృతీయ బహుమతి), వ్యాసరచన హై స్కూల్ లెవెల్ లో యస్.ఉష (ప్రథమ బహుమతి),బి మమతా (ద్వితీయ బహుమతి),ఏ . లక్ష్మీ (తృతీయ బహుమతి),  జూనియర్ కాలేజ్ లెవెల్ లో కే. లహరిక(ప్రథమ బహుమతి) ,వి. భువనేశ్వరి(ద్వితీయ బహుమతి), కే,సింధు(తృతీయ బహుమతి),డిగ్రీ కాలేజ్ లెవెల్ లో బి. ధనలక్ష్మి (ప్రథమ బహుమతి),,బి. సాయి స్పూర్తి (ద్వితీయ బహుమతి), యస్ . రవికుమార్ (తృతీయ బహుమతి), పెయింటింగ్ పోటీల్లో హై స్కూల్ లెవెల్ :యం . జశ్వంత్ప్రథమ బహుమతి, ఏ . వైష్ణవి  ద్వీతీయ బహుమతి ,కే. రవళి-తృతీయ బహుమతి,జూనియర్ కాలేజ్ లెవెల్ లో సమీరా ప్రథమ బహుమతి,వి. భావన ద్వీతీయ బహుమతి , కే. శ్రీకాంత్ తృతీయ బహుమతి , డిగ్రీ కాలేజ్ లెవెల్ లో బి. సాయికుమార్ ప్రథమ బహుమతి,యన్. సాహితి ద్వీతీయ బహుమతి , పి. సంధ్య తృతీయ బహుమతి,ని పొందడం జరిగినది. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబర్చిన డ్యాన్స్ మాస్టర్లు రమేష్ రాజు-డ్యాన్స్ అకాడమీ,శ్రీ భరత్ డ్యాన్స్ అకాడమీ, యోగా మాస్టర్ శ్రీ శివ  గారికి మరియు యువజన నాయకులు శ్రీ,కరుణ్ గారికి  కూడా బహుమతులను అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమములో శ్రీ బాలాజీ,జయశ్రీ,అంజయ్య,DIEO -సంజీవ గారు, DEO ఆఫీస్ సిబ్బంది  జోసెఫ్ గార్లు, మరియు DYSO మరియు SDTC staff పాల్గొన్నారు, సుమారు  150 మందితో ఈ కార్యక్రమం విజయవంతంగా  నిర్వహించడం జరిగింది. 

Share This Post