ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా అనాధ పిల్లల విహార యాత్ర బస్సును జెండా ఊపి ప్రారంభిస్తున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్.

విజ్ఞాన సముపార్జన కై పర్యాటక కేంద్రాలను సందర్శించాలి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

విహార యాత్ర ను జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్

00000

విజ్ఞాన సముపార్జన, మానసిక ప్రశాంతత కోసం పర్యాటక కేంద్రాలను సందర్శించాలని
జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన విహార యాత్ర ను సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ఆవరణలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవితంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడులకు గురి అవుతున్నారని, ఒత్తిడిని అధిగమించేందుకు వీలున్నప్పుడల్లా పర్యాటక స్థలాలు సందర్శించాలని తెలిపారు. దీనివల్ల మానసిక ప్రశాంతత చేకూరుడమే కాకుండా విజ్ఞానాన్ని సమాపార్జించు కోవచ్చని అన్నారు. జిల్లాలో మానేరు జలాశయం, ఉజ్వల పార్క్, డీర్ పార్క్, బోటింగ్ ఉన్నాయని, వీటిని సందర్శించేందుకు పర్యాటకులు వస్తున్నారని త్వరలోనే మానేరు రివర్ ఫ్రంట్ అందుబాటులోకి రానుందని, దీనివల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందనుందనీ తెలిపారు. నగరంలోని ఒక అనాధ ఆశ్రమం లో ఆశ్రయం పొందుతున్న 30 మంది విద్యార్థినీలకు విహార యాత్రకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. ఎలగందుల ఖిల్లా, వేములవాడ, కొండగట్టు, కరీంనగర్ మ్యూజియం, ఉజ్వల పార్క్, డీర్ పార్క్ లను వారికి చూపించడం వలన వారు విజ్ఞానం సమర్థించుకోవడం తోపాటు మానసిక ప్రశాంతత పొందుతారని కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వరరావు, జాతీయ యువజన అవార్డు గ్రహీత కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post