ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల విద్యార్ధినిల విహార యాత్ర బస్ను గురువారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జెండా ఊపి ప్రారంభించారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు 23 ఖమ్మం:

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల విద్యార్ధినిల విహార యాత్ర బస్ను గురువారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థిని విద్యార్థుల విహార యాత్రలో భాగంగా నేడు నేలకొండపల్లి మండలం బౌద్ధస్థూపం సందర్శన నిమిత్తం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశా విద్యార్థినులు సుమారు 40 మంది విహార్ యాత్రకు వెళ్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా ఈ నెల 24, 25 వ తేదీలలో నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలో విద్యార్థులకు పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

జిల్లా పర్యాటక శాఖాధికారి సుమన్ చక్రవర్తి, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా॥జి పద్మావతి, అద్యాపకులు మాధవి, ఇందిర, జాస్మిల్టన్, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post