ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో వక్తృత్వ, వ్యాస రచన,పెంటింగ్ పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేసినట్లు జిల్లా రెవిన్యూ అధికారి రాధిక రమణి తెలిపారు

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో వక్తృత్వ, వ్యాస రచన,పెంటింగ్ పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేసినట్లు జిల్లా రెవిన్యూ అధికారి రాధిక రమణి తెలిపారు.

శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో విద్యార్థులకు జూనియర్ సీనియర్ విభాగాలలో వక్తృత్వ, వ్యాస రచన, పెయింటింగ్ పోటీలను నిర్వహించామన్నారు. ఆయా విభాగాలలో సుమారు వందకు పైగా విద్యార్థులు పాల్గొన్నారని, అందులో మొత్తం 24 మంది విజేతలుగా నిలిచారని ఆమె తెలిపారు. ఆయా విభాగాల్లో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులకు విజేతలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.

విజేతలు ఈనెల 27న ఉదయం 9:45 గంటలకు జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించు ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలకు హాజరై బహుమతులు అందుకోవాల్సిందిగా ఆమె సూచించారు.

పోటీల నిర్వహణలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవిందరావు,జిల్లా యువజన సంక్షేమ అధికారి జావిద్ అలీ, జిల్లా సైన్స్ అధికారి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post