“ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం” ర్యాలీ : జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి

పత్రికా ప్రకటన        తేది:31.05.2022, వనపర్తి.

మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలరని, పొగాకు, ధూమపానం కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి ఆదేశించారు.
మంగళవారం “ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం” సందర్భంగా వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి అంబేద్కర్ చౌక్ వరకు వైద్య సిబ్బంది, విద్యార్థులతో కలిసి ఆయన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పొగాకును వ్యతిరేకించాలని సిగరెట్, బీడీ, గుట్కా లాంటివి తీసుకోవడం వల్ల క్యాన్సర్ కు గురవుతారని, ఆరోగ్యంగా ఉండాలంటే పొగాకుకు దూరంగా ఉండాలని ఆయన అన్నారు. ధూమపానం చేయడంవల్ల వారితో పాటు ఇతరులకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన వైద్య సిబ్బందికి ఆదేశించారు.
వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవి శంకర్ మాట్లాడుతూ ” ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం” సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. చిన్న వయస్సు గలవారు ధూమపానం చేయడం వల్ల వారి ఆరోగ్యం చెడిపోతుందని, తద్వారా క్యాన్సర్, క్షయ వంటి రోగాలు వస్తాయని ఆయన వివరించారు. వైద్య సిబ్బంది పాఠశాలల్లో, కళాశాలల్లో, గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసేలా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. బహిరంగ ధూమపానం చేయడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసే వారిని గుర్తించి వారికి జరిమానాలు వేసేందుకు ఒక టీమ్ ను ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

Share This Post