పత్రికా ప్రకటన తేది:19.8.2021. వనపర్తి.
ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు:
గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మీడియా జర్నలిస్టు ఫోటోగ్రాఫర్లకు ”ప్రపంచ ఫోటోగ్రఫీ డే” సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఛాంబర్ లో ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా వనపర్తి జిల్లా ఫోటో జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష గారికి ఫోటో జర్నలిస్టులు శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్చన్ని అందజేశారు. ఫోటో జ ర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు, డబల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని వారు జిల్లా కలెక్టర్ ను కోరారు. అనంతరం ఫోటో జర్నలిస్టులతో కలిసి కేక్ కట్ చేసి మీడియా ఫోటో జర్నలిస్టులకు ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఫోటో జర్నలిస్టులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక విషయాన్ని మనసులో ఎల్లప్పుడు గుర్తుండి పోయేలా చూసే శక్తి ఒక ఫోటోకు ఉందని ఆమె అన్నారు. చిత్రం ద్వారా ఎంత పెద్ద విషయమైనా ఒక ఫోటో చెప్పవచ్చు అని ఆమె తెలిపారు. ఫోటో జర్నలిస్టులు వారు తీసిన చిత్రాలను ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై తీసిన దృశ్యాలన్నిoటితో ఒక ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆమె ఫోటో జర్నలిస్టులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.వేణు గోపాల్, జిల్లా పౌర సంబంధాల అధికారి రషీద్, జిల్లా మీడియా ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు (ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్) మొహమ్మద్ యూసూఫ్, ప్రధాన కార్యదర్శి, నమస్తే తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ గుంటి వినోద్, ఉపాధ్యక్షులు, వార్త దినపత్రిక ఫోటో జర్నలిస్టు బాలరాజు, ఫోటోజర్నలిస్ట్ యాది రెడ్డి, సహాయ కార్యదర్శి, ఈనాడు ఫొటో జర్నలిస్ట్ రాము, కోశాధికారి, సూర్య దినపత్రిక ఫోటో జర్నలిస్టు ఎస్ వి రమేష్, ఫోటోగ్రాఫర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
…………….
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.