ప్రభుత్వంలోని వివిధ శాఖల ద్వారా అందిస్తున్న సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని :- జిల్లా కలెక్టర్ డి హరిచందన జిల్లా ప్రజలను సూచించారు

ప్రభుత్వంలోని వివిధ  శాఖల ద్వారా అందిస్తున్న సబ్సిడీ రుణాలను  సద్వినియోగం చేసుకోవాలని :-  జిల్లా కలెక్టర్ డి హరిచందన జిల్లా ప్రజలను సూచించారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అనేక సబ్సిడీ రుణాలు  ఇచ్చేందుకు పథకాలు పెడుతున్నపటికి వాటిని ఎలా పొందాలో సరియైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది లబ్ది పొందలేకపోతున్నారని కలెక్టర్ తెలిపారు.  దీనిని అధిగమించడానికి నేడు రుణ మేళా నిర్వహించి ఆశావహులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.  గురువారం జిల్లా కేంద్రం అంజన గార్డెన్ లో  లీడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఋణ మేళ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె  మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సబ్సిడీ రుణాలు ఎలా పొందవచ్చు,  అర్హత ఏమిటి, ఎలాంటి సబ్సిడీ రుణాలు ఉన్నాయి అనే పూర్తి వివరాలు రుణ మేళాలో వివరించడం జరుగుతుందన్నారు. జిల్లా ఏర్పడ్డాక ఇదే మొదటి ఋణమేళా అని పేర్కొన్నారు.  జిల్లా లో ఉన్న మహిళ సంఘాలు అందరూ ఒకే రకం వ్యాపారాలకై రుణం తీసుకోవడం వలన ఏ ఒక్క సంఘం అభిరుద్ది చెందే అవకాశం ఉండదన్నారు.  ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఆలోచనతో వాళ్లలో ఉన్న నైపుణ్యాలను బట్టి రుణాలకు ప్రతిపాదనలు పెట్టాలని సూచించారు.  ఉదా. అందరూ వాహనాల కొనుగోలుకె  ఋణ ప్రతిపాదనలు పెడితే వాటిని ఎక్కడ నడుపుకోవాలి పోటీ ఎక్కువై డిమాండ్ తగ్గిపోతుందనే ఉద్దేశంతో బ్యాంకులు కొద్దిమందికే ఇచ్చి మిగిలిన దరఖాస్తులు తిరస్కరిస్తారని ఉదహరించారు.  అదే వేరే వేరే ప్రాజెక్టులు ఇతర వ్యాపారాలకు సరియైన ప్రతిపాదనలు పెడితే అందరికి రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.   పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం అవుతుందని పట్టు దలతో ముందుకుసాగా లన్నారు.  ఋణ మెళ కు వచ్చిన వారి ద్వారా వివరాలను సేకరించి అర్హులైన వారికి వెంటనే ఋణాలను మంజూరు చేయాలని.  ఏ ఏ ప్రభుత్వ శాఖ ఏ రకమైన సబ్సిడీ రుణాలు అందిస్తుందో వివరించి చెప్పాలని అధికారులను ఆదేశించారు.  అదే సమయంలో అట్టి రుణాలు పొందేందుకు అర్హతలు ఏమిటి వారి క్రెడిట్ స్కోర్ ఎలా ఉంది ప్రతిపాదనలు ఎలా చేయాలి అని వివరాలు బ్యాంకర్లు తెలియపర్చాలని సూచించారు.

ఈ కార్యక్రమం లో ఎస్.బి.ఐ డిజియం ఆర్. నటరాజన్, gm dic రాంసుబ్బా రెడ్డి,LDM ప్రసన్న కుమార్,  AGM sbi శ్రావణ్ కుమార్ రెడ్డి, DGM dccb కృష్ణ ప్రసాద్, Agm apgvb జి శుభాష్, డైరెక్టర్ RSETi dv sk ప్రసాద్, dgm కెనరా బ్యాంక్  శ్రీనివాసన్ మూర్తి, dupty kvic శేషిరంజన్ వర్మ , జిల్లా అధికారులు రషీద్, డిఆర్డీఓ గోపాల్,  కన్యాకుమారి తదితరులు పాల్గొన్నారు.

Share This Post