ప్రభుత్వం అందించే రుణ లక్ష్యాలను బ్యాంకర్లు సకాలంలో సాధించి, రుణ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ రాజివ్ గాంధి హనుమంతు తెలిపారు.

మంగళవారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైతుల పంట రుణాలు, ఎస్.హెచ్.జి., ఎస్సి ఎస్టీ కార్పోరేషన్ ల రుణాలు, ఆర్థిక అక్షరాస్యత, ఇతర అంశాల పై డి.సి.సి బ్యాంకర్ల త్రైమాసిక పురోగతి పై సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, దానికి సంబంధించిన పురొగతి తదితర అంశాల ను లీడ్ బ్యాంక్ మేనేజర్ వివరించారు.
ప్రజలు ఆర్థికంగా ఎదిగేందకు అవసరమైన సహకారం బ్యాంకింగ్ రంగం అందించాలని, అభివృద్ది కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి 2021 పంట ఋణాలకు గాను రూ.1262.66 కోట్ల రుణం మంజూరి చేయడం లక్ష్యం కాగా సెప్టెంబర్ చివరి వరకు రూ. 565.48 కోట్లు రుణాలు రైతులకు అందించామని అధికారులు తెలిపారు. రైతులకు రుణ లక్ష్యాలు చేరుకోవడంలో మరింత పురొగతి సాధించాల్సి ఉందని, రైతులు తమ రుణాలను రెన్యూవల్ చేసుకునే అంశం పై వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. రైతులకు రుణాలు మంజూరు లక్ష్యాల ను చేరుకోకపోవడం పై బ్యాంకుల వారిగా కలెక్టర్ సమీక్షించారు.

మహిళలు ఆర్థికంగా ఉన్నతస్థాయికి చేరుకునేలా ప్రభుత్వం అందించే స్వశక్తి సంఘాల రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. మన జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ చివరి వరకు స్వశక్తి సంఘాలకు రూ.147.55 కోట్లు రుణాలు
అందించామని అధికారులు తెలిపారు.
ఎస్సీ కార్పో రేషన్ లో పెండింగులో ఉన్న యూనిట్లు త్వరగా గ్రౌండింగ్ పూర్తి చేయాలని , అదేవిధంగా ప్రభుత్వం సబ్సీడి విడుదల చేసిన వారికి రుణాలు మంజూరు చేసి యూనిట్లను గ్రౌండ్ చేసేలా బ్యాంకర్లు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. యువతకు ఉపాధి అందించే విషయంలో అధికారులు చొరవ చుపాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. జిల్లాలో డిజీటల్ పేమెంట్స్ అధికంగా వుండేలా చుడాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడానికి బ్యాంకులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమీక్షలో లీడ్ బ్యాంకు మేనేజరు మురళి మోహన్ , జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ కుమార్, ఈడి.ఎస్సి కార్పొరేషన్ మాధవీలత , ఎస్ బి ఐ ఆర్ ఏం హరికృష్ణ , ఆర్బీఐ ఎల్ డిఓ సాయిచరణ్, నాబార్డు ఏ జీఎం చంద్రశేకర్, వివిధ బ్యాంకు కంట్రోలర్లు, మేనేజర్లు , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.

 

Share This Post