ప్రభుత్వం అందిస్తున్న అరుదైన అవకాశం సద్వినియోగం చేసుకోండి
మొదటి విడత 237 ప్లాట్లు వేలం ద్వారా విక్రయం
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
00000
నుస్తులాపూర్ గ్రామం అంగారక టౌన్ షిప్ లొ వేలం ద్వారా ఫ్లాట్ లను ప్రభుత్వం విక్రయం చేస్తున్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు.
సోమవారం తిమ్మాపూర్ మండలం లోని నుస్తులాపూర్ గ్రామ రైతు వేదికలో నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.ఈ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం తిమ్మాపూర్ మండలం లోని నుస్తులాపూర్ అంగారిక టౌన్ షిప్ హైదరాబాద్ హైవే కు దాదాపు 500 మీటర్ల దూరంలో డిటిసిపి చే ఆమోదించబడి, సుడా ద్వారా అభివృద్ధి చేయబడుతున్న లే-అవుట్ లో 237 ప్లాట్లు (మొత్తం 819) వేలం ద్వారా అమ్మకానికి మొదటి దశ వేలం వేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనిఆమె తెలిపారు. కనీసధర రెసిడెన్షియల్ ₹6,000/- sq yard, కమర్షియల్ ₹8,000/- sq yard నిర్ణయించడం జరిగిందని,
ఒక్కొక్క ప్లాటు వేలం పాట ద్వారా అధిక మొత్తం వేలం పాడిన వారికి కేటాయించడం జరుగుతుందని తెలిపారు. మొత్తం ధరను వేలం తేదీ నుండి 7/45/90 రోజులలో 33% చొప్పున చెల్లించాలని తెలిపారు. దరఖాస్తు ఫారం, రూ. 10,000/- ల డిపాజిట్ (జిల్లా కలెక్టర్, కరీంనగర్ గారి పేరున డిమాండ్ డ్రాఫ్ట్) కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణ లో ఉన్న “SUDA” ఆఫీసులో సమర్పించాలని అన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది 19.06.2022 అని వేలం తేదీలు 20.06.2022 నుండి 24.06.2022 వరకు అని తెలిపారు.