ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం చేస్తుందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు

కామారెడ్డి పట్టణంలోని లక్ష్మీదేవి గార్డెన్లో ప్రభుత్వ క్రిస్టమస్ సెలబ్రేషన్స్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో పండగలకు దుస్తులను పంపిణీ చేస్తున్నారని చెప్పారు. దళితులు పేదరికంలో ఉన్నాయని వారి కోసం ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని తెలిపారు.క్రైస్తవ సోదరులకు క్రిస్టమస్ పండగ శుభాకాంక్షలు చెప్పారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. కరోనా వల్ల ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఏసుప్రభువు చూడాలని కోరారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. క్రైస్తవులకు పండుగ కానుకగా దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, వైస్ చైర్ పర్సన్ హిందూ ప్రియా, ఎంపీపీ ఆంజనేయులు, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ రావు, కౌన్సిలర్ సుగుణ, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. —————— జిల్లా ప్రజాసంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది.

Share This Post