ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మైనారిటీల కు అందాలి


ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మైనారిటీల కు అందాలి

విద్యార్థులకు మెను ప్రకారం సరైన భోజనం అందజేయాలి

మైనారిటి పాఠశాలల్లో వాష్ రూంలను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి

వక్స్ బోర్డ్ భూములు ఆక్రమణ కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి

జాతీయ మైనారిటి కమీషన్ సభ్యురాలు సయ్యద్ షహేజాది

 0 0 0 0

   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీల అభివృద్ది, సంక్షేమం కోసం అమలు చేసే ప్రతి పథకం మైనారిటీలకు అందేలా చూడాలని జాతీయ మైనారిటి కమీషన్ సభ్యురాలు సయ్యద్ షహేజాది అన్నారు.

    మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి 15 సూత్రాలు కార్యక్రమం మరియు మైనారిటిల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలపై కలెక్టరెట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మైనారిటి పాఠశాలలు, మదర్సాలలో చదివే పిల్లలందరికి ప్రభుత్వం జారీచేసిన మెను ప్రకారం మంచి ఆహారాన్ని అందించాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మైనారిటి బాలికల పాఠశాలల్లో ఖచ్చితంగా వాష్ రూంలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఉపాధి కల్పన శాఖ నుండి అందించే శిక్షణ, ఉపాధి అవగాహాన కార్యక్రమాలలో మైనారిటిలకు ప్రాదాన్యతను ఇవ్వాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చివరి లబ్దిదారుని వరకు చేరేలా చూడడంతో పాటు పథకాల అమలులో క్రింది స్థాయి సిబ్బంది పనితీరును అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ప్రతినెల బాలికలకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించాలని, బీట్ రూట్ వంటి ఆహారంతో పాటు, ప్రతి రోజు వ్యాయామాన్ని చేయించాలని సూచించారు. మసీ దులలో ఎన్నికలు నిర్వహించాలని, మసీదులు, దర్గా మొదలగు వక్స్ భూములు ఆక్రమణలకు గురికాకుండా బౌండరీలను ఏర్పాటు చేయాలని సూచించారు. మైనార్టీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం 15 సూత్రాల అమలు తీరుపై సమావేశాలను నిర్వహించాలని సూచించారు. ముస్లీం ప్రాధాన్యత ప్రాంతాలలో మరియు కార్యాలయాల సైన్ బోర్డులు ఉర్దూలో కూడా ఉండేలా చూడాలని తెలిపారు.

    ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్, ఎసిపి తులా శ్రీనివాస్, ఆర్డిఓ ఆనంద్ కుమార్, మున్సిపల్ కమీషనర్ సేవా ఇస్లావత్, డిఆర్డిఓ శ్రీలత రెడ్డి, ఎల్డియం ఆంజనేయులు, పిడి మెప్మా రవీందర్, జిల్లా వైద్యాధికారి జువెరియా, స్త్రీ, శిశు, వయోవృద్దుల మరియు వికలాంగుల సంక్షేమాధికారి సభితా కుమారి, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్, మరియు వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు.

Share This Post