ప్రభుత్వం ఆదేశాల ననుసరించి అర్హులైన మహిళలకు అక్టోబర్ 2 నుండి బతుకమ్మ చీరల పంపిణీ కి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారుల ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,అదనపు కలెక్టర్ (రెవెన్యూ)వి.చంద్ర శేఖర్ లు ఆదేశించారు

బుధవారం  ఎం.పి.డి. ఓ.లు,తహశీల్దార్ లు,మున్సిపల్ కమిషనర్ లతో డి.ఆర్.డి.ఏ,చేనేత శాఖ అధికారులతో వారు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి బతుకమ్మ చీరల పంపిణీ పై పలు సూచనలు చేశారు.గోదాం ల నుండి పంపిణీ ప్రాంతాలకు సకాలం లో చీరలను చేర వేయాలని అన్నారు. పంపిణీ కార్యక్రమంలో  ప్రొటోకాల్ పాటించి స్థానిక శాసన సభ్యులు,ఇతర ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి బతుకమ్మ చీరల పంపిణీ పూర్తి చేయాలని వారు సూచించారు.ఈ టెలి కాన్ఫరెన్స్ లో డి.ఆర్.డి.ఓ.కాళిందిని,డి.పి.ఓ.విష్ణు వర్ధన్,జడ్.పి.సి.ఈ. ఓ.వీర బ్రహ్మ చారి,జిల్లా పౌర సరఫరా ల అధికారి వెంకటేశ్వర్లు,పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Share This Post