ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం ద్వారా సరికొత్త ఆవిష్కరణలకు అవకాశం కల్పిస్తుందని జిల్లా రెవెన్యూ అధికారి రాధిక రమణి తెలిపారు.

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, జూలై 31:–
ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం ద్వారా సరికొత్త ఆవిష్కరణలకు అవకాశం కల్పిస్తుందని జిల్లా రెవెన్యూ అధికారి రాధిక రమణి తెలిపారు.

శనివారం డిఆర్ఓ ఛాంబర్లో విద్య, వ్యవసాయ, పరిశ్రమల, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులు, వివిధ కళాశాలల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, ఇంటింటా ఇన్నోవేటర్ పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటింటా ఇన్నోవేటర్ తో ప్రతి వ్యక్తి లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆన్లైన్ వేదికగా నూతన ఆవిష్కరణల ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

గృహిణులు మొదలుకొని అన్ని రంగాలకు చెందిన వారు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చని తెలిపారు.

వినూత్న ఆలోచనలకు రూపకల్పన చేసి జిల్లా నుండి ఎక్కువ సంఖ్యలో ఆవిష్కరణలు వెళ్లేలా కృషి చేయాలని ఆయా అధికారులను కోరారు. ఆవిష్కర్తలు ఆగస్టు 10 లోగా ఆన్లైన్లో తమ ఆవిష్కరణను పంపాలని తెలిపారు.

ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వాక్యాలు, రెండు నిమిషాలు వీడియోను, ఆవిష్కరణ నాలుగు ఫోటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్ నెంబర్, వయస్సు, ప్రస్తుత వృత్తి, గ్రామం, జిల్లా పేరును విధిగా పేర్కొంటూ నిర్ణీత గడువులోగా 9100678543కి వాట్సాప్ చేయాలని ఆమె సూచించారు.

జిల్లా నుండి ఎక్కువ సంఖ్యలో ఆవిష్కరణలు పంపాలని, రాష్ట్ర స్థాయిలో జిల్లాను ముందుంచాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో డి ఈ ఓ రాజేష్, డి పి ఓ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి శాఖల ప్రతినిధులు, తార డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, జె ఎన్ టి యు , గీతం యూనివర్సిటీల ప్రతినిధులు, జిల్లా సైన్స్ అధికారి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post