పత్రికా ప్రకన తేదీ 1-02.-2023
ప్రభుత్వం కల్పించిన వసతి సదుపాయాలతో విద్యార్థులు విద్యలో చక్కగా రాణించి ఉన్నత శిఖరాలకు చేరాలని జడ్పీ చైర్మన్ సరిత అన్నారు.
బుధవారం గద్వాల మండలం కాకులారం గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద ఏర్పాటు చేయబడిన యుపిఎస్ పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలను బడికి పంపాలని పనులకు పంపవద్దని అన్నారు. చదువుకునే వయసులో పనులకు వెళితే వారికి అక్షర జ్ఞానం రాకపోగా వారి కుటుంబం వెనుక బడుతుందని అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లాలోని పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకున్నదని అన్నారు. . బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్యాభివృద్ధిలో ముందుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని అన్నారు.పాఠశాల సెలవు దినాలలో గ్రామస్తులు పాఠశాల ఆవరణను, గదులను కాపాడుకోవాలని తెలిపారు. టాయిలెట్లు బాత్రూంలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీటి వసతి ఎల్లవేళలా ఉండేలా చూడాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ జిల్లాలో మన ఊరు మనబడి క్రింద 161 పాఠశాలలను గుర్తించి టాయిలెట్లు, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, కాంపౌండ్ వాల్, అదనపు గదులతో పాటు గ్రీన్ బోర్డులు నిర్మించినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధుల సహకారంతో పిల్లలు పాఠశాలకు వచ్చేలా గ్రామస్తులు చర్యలు తీసుకోవాలన్నారు. సమాజంలో చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. మన ఊరు మనబడి క్రింద ఏర్పాటు చేసిన వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్ఫ్యూమర్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జంబురామన్ గౌడ్ తదితరులు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ సరోజమ్మ, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, డీఈవో సిరాజుద్దీన్, ఎంఈఓ సురేష్ ,హెడ్మాస్టర్ పరమేశ్వర్ రెడ్డి, సర్పంచ్ పావని నరసింహులు, ఎస్ఎంసి చైర్మన్ తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————————
జిల్లా సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల జారీ చేయబడినది.