ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తుందని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తుందని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

సోమవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విద్యార్థులు యువత తో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మన సంస్కృతిని పర్యాటక విశిష్టతను తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆ దిశగా తెలంగాణ పర్యాటక రంగం విశిష్టత అందరికీ తెలిసే విధంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. విజ్ఞాన సముపార్జనకు, చారిత్రక విషయాల ఆకళింపునకు పర్యాటక స్థలాలను సందర్శించాలన్నారు.

జిల్లాలో గల సింగూర్ ప్రాజెక్ట్, మంజీరా డ్యాం, ఝరాసంఘం శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి, బొంతపల్లి వీరభద్ర స్వామి, రేజింతల్ సిద్ధి వినాయక దేవాలయాలు ఇప్పటికే పర్యాటక ప్రాంతాలుగా విలసిల్లుతున్నాయన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లా వాసులే కాకుండా పక్క రాష్ట్రాల పర్యాటకులు సందర్శిస్తున్నారని ఆయన తెలిపారు.

విద్యార్థులకు సీనియర్, జూనియర్ విభాగాలలో పర్యాటక రంగం ఆవశ్యకత ,అభివృద్ధిపై నిర్వహించిన వక్తృత్వ, వ్యాసరచన, పెయింటింగ్ పోటీలలో గెలుపొందిన (24) మంది విజేతలకు ఆయన ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి రాధికా రమణి, జిల్లా యువజన సంక్షేమ అధికారి జావిద్ అలీ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద రామ్, జిల్లా సైన్స్ అధికారి విజయ్ కుమార్, అధికారులు, సిబ్బంది ,విద్యార్థులు, యువత, కళాకారులు ,తదితరులు పాల్గొన్నారు.

Share This Post