ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులలో  వివిధ సేవలు అందించే విధంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి వసతులను కల్పిస్తుందని ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డా.జి. శ్రీనివాస రావు పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులలో  వివిధ సేవలు అందించే విధంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి వసతులను కల్పిస్తుందని ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డా.జి. శ్రీనివాస రావు పేర్కొన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలపై వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  వివిధ ఆరోగ్య కార్యక్రమాల పారామీటర్స్ ను పిహెచ్సి వారిగా సమీక్షించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో అందించే వైద్య సేవలు ప్రజల్లో విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించాలని అన్నారు. నాణ్యమైన  వైద్య సేవలు అందించాలని సూచించారు.
 త్వరలో అన్ని పీహెచ్సీలలో ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అందుకు అన్ని విధాల వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని డాక్టర్లకు సూచించారు.  పీహెచ్సీలలో డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉదయం 9 గంటల నుండి నాలుగు గంటల వరకు విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు.
వంద శాతం సహజ ప్రసవాలు జరిగేలా చూడాలని చెప్పారు. అన్ని కేటగిరీల లో కరోనా వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. ఆశా వర్కర్ల నుండి సూపర్వైజర్ అధికారుల వరకు పేద ప్రజలకు సేవలు అందించడంలో బాధ్యతయుతంగా వ్యవహరించాలన్నారు.
డాక్టర్లు ఆయా వైద్య సిబ్బంది అన్ని ఇండికేటర్స్ ను ఇంప్రూవ్ చేసుకోవాలని, ఏ ఇండికేటర్ లోనైనా వెనకబడితే దానిపై దృష్టి సారించి పురోగతి సాధించాలని అన్నారు. ఆస్పత్రులను పరిశుభ్రంగా ఉంచాలని,  ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చూడాలన్నారు. డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ లు ప్రతి నెల 15 రోజులు క్షేత్ర పరిధిలో పర్యటించి ఆయా విషయాలపై పర్యవేక్షించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు.
జిల్లా సహజ ప్రసవాల లో, అన్ని పారామీటర్స్ లలో బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు.
వచ్చే ఒకటి రెండు వారాల లో వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ వెలువడుతుందని, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న డాక్టర్లకు వెయిటేజీ ఉంటుందని, దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వైద్యులు వైద్య సిబ్బంది బాగా పనిచేసి  అన్నివిధాల మరింత పురోగతి సాధించాలని ఆయన కోరారు.
అంతకుముందు జిల్లాలోని భానూర్,కంది, ఆర్ సి పురం పి.హెచ్.సి ల ను  ఆయన సందర్శించి పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు ఆరా తీశారు.
సమీక్షలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ గాయత్రీదేవి, డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ లు, ప్రోగ్రాం అధికారులు, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.

Sir Once Check
Regards..DPROSANGAREDDY  DISTRICT.

Share This Post