*ప్రెస్ రిలీజ్*
*ఏప్రిల్ 30*
*హనుమకొండ*
ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని అధికారులు చిత్తశుద్ధి తో అమలు చేస్తూ లక్ష్యన్నీ చేరుకోవాలని *కలెక్టర్ రాజీవ్ గాంధి హనుమంతు* అధికారులను ఆదేశించారు.
శనివారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ హరిత హారం పై ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓలు, ఎంపిఓలు,ఎపిఓలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ
జిల్లాలో లక్ష్యాలకు అనుగుణంగా హరిత హారం కార్యక్రమం నిర్వహించాలని అన్నారు.
హరితహారం కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజాఉద్యమంలా జరగాలని కోరారు . ఈ కార్యక్రమంపై విస్త్రృత ప్రచారం నిర్వహించాలని విద్యార్థులను భాగస్వాములను చేయాలని అన్నారు.
నర్సరీల్లో కావలసిన మొక్కలు మునగ, కరివేపాకు, బొప్పాయి,తదితర మొక్కలు సిద్దంగా ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు.
ప్రతి మండలానికి ఐదు బృహత్ పల్లే ప్రకృతి వనాలు ఉండాలని
పల్లే ప్రకృతి వనాల్లో వీలైనంత ఎక్కువ రావి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు మద్య మధ్యలో నాటాలని అన్నారు. జిల్లా లో అటవీ విస్తీర్ణం పెంచేందుకు అధికారులు సమన్వయము తో పని చేయాలనీ అన్నారు.
జిల్లాలో మిగిలి ఉన్న వైకుంఠ దామాల పనులను వెంటనే పూర్తి చేసి అందుబాటులో ఉంచాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో అన్ని గ్రామపంచాయతీ లలో ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి వైకుంఠ దామలు పనులు చేపట్టలనీ అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే సంబంధిత అధికారుల ను ఎట్టి పరస్థితుల్లో ఉపేక్షించేది లేదని,మిగిలి ఉన్న వైకుంఠ ధమాల పనులను పూర్తి చేసి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వైకుంఠ దమాల పనుల పురోగతి పై క్షేత్ర స్థాయి పర్యటనలు చేసి ఎప్పటికప్పుడు నివేదికలు అందచేయాలని ఆదేశించారు. ఎవెన్యూ ప్లాంటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని అయన అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్య రాణీ, ఆర్డిఓ వాసు చంద్ర, డి ఆర్డిఓ శ్రీనివాస్ కుమార్, అటవీ, పంచాయతీ రాజ్, రెవిన్యూ ఉన్నతికారులు పాల్గొన్నారు.