ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన  పోడు భూముల సమస్యలు పరిష్కరించేందుకు దరఖాస్తు స్వీకరించడం జరుగుతుంది: జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

ప్రచురణార్థం
ములుగు జిల్లా:
నవంబర్-09,( మంగళ వారం)

ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన  పోడు భూముల సమస్యలు పరిష్కరించేందుకు దరఖాస్తు స్వీకరించడం జరుగుతుంది.ఇట్టి దరఖాస్తు     ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చునని , గ్రామ సభల ద్వారా పోడు సమాచారం పై పూర్తి అవగాహన ప్రజలకు కల్పించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు
మంగళవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కన్నాయి గూడెం మండలంలోని రాజం పెట్,తుపాకుల గూడెం గ్రామాలలో పర్యటించి పోడు భూముల పై నిర్వహిస్తున్న గ్రామ సభల పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడతూ పొడుభుముల పై ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారా లేదా అనే విషయం పై ప్రజలనుండి పోడు భూముల కు ఎలా ధరకాస్తు చేయాలి వాటికి ఏ ఏ ఆధారాలు సమర్పించాలని ప్రజలను అడిగి  తెలుసుకున్నారు. డిసెంబర్ 2005 నుండి సాగు చేసిన భూమి కి ప్రతి ఒక్క  హ్యాబి టేషన్లలో ఎఫ్ఆర్సి టీం లు ఏర్పాటు చేయాలని,ప్రతి టీం లో 15 మంది సభ్యులతో కమిటీలు ఫాo చేయాలని అన్నారు. పోడు భూముల దరఖాస్తులు ప్రింటెడ్ పత్రాలుఅన్ని గ్రామ పంచాయితీలలో అందుబాటులో ఉన్నాయని, అట్టి దరఖాస్తు ఫారాలు ఉచితంగా పొందాలని, ఒక్క రూపాయి కూడా ఎవ్వరు ఇవ్వకూడదని జిల్లా కలెక్టర్ అన్నారు.

కొత్త గా అడవులను నరికి పోడు చెయ్యాలని చూస్తే అటవీ హక్కు చట్టం కింద కేసు నమోదు చేయవలసి ఉంటుందని, అటవులని రక్షించు కోవడం మన అందరి బాధ్యత తీసుకోవాలని అన్నారు. పోడు భూమి ఎక్కడ ఉంటే అక్కడ నే ధరకాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్నారు.

గిరిజన గ్రామాలలో ఎఫ్ఆర్సి సభ్యులు మొత్తం గిరిజనులే ఉండేలా చూడాలని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజల కోరిక మేరకు ఫిషరీస్ సొసైటీల గురుంచి ఆలోచిస్తానని, గిరి వికాసం పథకం కింద బోర్ల రిపేరు కు సంబంధిత అధికారులతో మాట్లాడతానని అన్నారు. అటవీ అధికారుల నుండి రోడ్ల మరమత్తులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడాలని ఫారెస్ట్ అధికారికి సూచించారు.
తుపాకుల గూడెం ప్రాథమిక పాఠశాల లో స్కూల్ టీచర్ మెటర్నిటీ సెలవులో వెళ్లి నందున మరొక్క టీచర్ ను వేయాలని ఏమ్ఈఓ ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి వెంకయ్య, సంబంధిత తహశీల్దార్లు దేవ్ సింగ్,ఎంపిడిఓ బాబు, సర్పంచ్ సూర్య నారాయణ, జడ్పిటిసి కె.గాంధీ,ఎంపీపీ సమక్క,పంచాయితీ సెక్రటరీ యం.అమని, ఎంఇఓ సురేందర్ పంపించండి

Share This Post