ప్రచురణార్థం 13 -12 -20 22
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తెలిపారు. మంగళవారం జిల్లాలోని జాజిరెడ్డిగూడెం మండలంలో అరవపల్లి గ్రామంలో గల ప్రైమరీ స్కూల్ ను రామన్నగూడెం ప్రైమరీ స్కూల్ ను కలెక్టర్ మధ్యాహ్నం ఆకస్మికంగా సందర్శించారు. ఇంజినీరింగ్ అధికారులకు పనులపై పలు సూచనలు చేశారు. త్రాగునీరు, టాయిలెట్స్, విద్యుత్ సౌకర్యం, పెయింటింగ్ ,ఇతరత్రా అన్ని పనులు పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పనులు పూర్తయిన వెంటనే గుత్తేదారులకు సకాలంలో నిధులు అందజేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు . అనంతరం కేజీబీవీ స్కూల్ జాజిరెడ్డిగూడెం నందు మధ్యాహ్న భోజనాన్ని, స్టోర్ రూమును కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులను రోజువారి మెనూ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో డీఈవో కే అశోక్, ఎంపీపీ మన్నే రేణుక లక్ష్మీ నరసయ్య యాదవ్, జడ్పిటిసి దావుల వీర ప్రసాద్ యాదవ్, ఎంపీడీవో విజయ, ఎంఈఓ బాలు, ఏఈ అశోక్ కుమార్, ప్రధానోపాధ్యాయులు ఎం ఏకలక్ష్మి, సిహెచ్ ధర్మయ్య, ఎస్ఎంసి చైర్మన్ మల్లేష్ సైదులు సిబ్బంది పాల్గొన్నారు.
———————————————–
జిల్లా సమాచార పారు సంబంధాల శాఖ సూర్యాపేట జిల్లా వారిచే జారీ చేయ నైనది