ప్రభుత్వం రజక ,నాయిబ్రాహ్మణుల ఆర్థిక స్థితి గతుల దృష్ట్యా ఉచిత విద్యుత్ సరఫరా పథకానికి శ్రీకారం చుట్టిందని, ఇట్టి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సూచించారు.

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, ఆగస్ట్ 3:–

ప్రభుత్వం రజక ,నాయిబ్రాహ్మణుల ఆర్థిక స్థితి గతుల దృష్ట్యా ఉచిత విద్యుత్ సరఫరా పథకానికి శ్రీకారం చుట్టిందని, ఇట్టి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సూచించారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన రజక, నాయిబ్రాహ్మణుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రజక, నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ అంశంపై అవగాహన కల్పించడం కోసం క్షేత్ర స్థాయిలో సర్పంచులు, గ్రామ కార్యదర్శులు దండోరా వేయించి తెలియజేయాలని సూచించారు.

గతంలో సొసైటీల వారీగా నమోదు చేసుకున్న వారికి త్వరలో ఆర్థిక సహాయం అందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ఆయా వర్గాల ప్రజలు ఉపయోగించుకునే విధంగా ప్రజా ప్రతినిధులు, ఇతర శాఖల అధికారులతో పాటు జిల్లా వెనుకబడినతరగతుల అభివృద్ధి శాఖ నుండి ప్రతి మండలానికి ఒక వసతి గృహ సంక్షేమాధికారి ని బాధ్యులుగా నియమిస్తూ ఈ పథకం అమలుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు.

జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ మాట్లాడుతూ ఈ పథకం మారుమూల కుగ్రామాలలో కూడా సద్వినియోగం అయ్యేలా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు.

జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి కేశురాం మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు ( 330) రజక,(582)మంది నాయి బ్రాహ్మణ లబ్ధిదారులు ఉచిత విద్యుత్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. చాలా మందికి దరఖాస్తు చేసుకునే విధానం పట్ల అవగాహన లేకపోవడం వల్ల తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు.

మీ సేవలో దరఖాస్తులను పూర్తి చేసే విధానంపై ఆయన క్లుప్తంగా వివరించారు.

సమావేశంలో మహేష్, జీతయ్య ,వెంకట్ ,సురేష్, పుండరీకం ,నర్సింలు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని తక్షణం అమలు చేసి గతంలో చెల్లించిన విద్యుత్ బిల్లులను తిరిగి ఇప్పించాలని కోరారు. అదేవిధంగా నాయిబ్రాహ్మణుల మహిళల స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని వారి అభివృద్ధి కోసం నిర్వహించుకుంటున్న బ్యూటీ పార్లర్ లకు కూడా ఉచిత విద్యుత్తును అందజేయాలని వారు కోరారు. ఉచిత విద్యుత్తును సింగిల్/ త్రిబుల్ ఫేస్ సరఫరా చేసే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని వారు కోరారు.

ఈ అవగాహన సదస్సులో కార్యాలయ ఏవో వెంకట నరసమ్మ, ఏ బి సి డి వో లు భాగ్యలక్ష్మి ,
కె. విటల్, వసతి గృహ సంక్షేమాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post