ప్రభుత్వపాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలలో కనీస మౌళిక వసతులు కల్పిoచాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్

ప్రభుత్వపాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలలో కనీస మౌళిక వసతులు కల్పిoచాలి

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్

00000

          మనఊరు- మనబడి కార్యక్రమంలో బాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్ వాడి కేంద్రాలలో మౌళిక వసతులను కల్పించాలని స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు.

సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అంగన్వాడి సూపర్ వైజర్లు, సిడిపిఓలు, డిడబ్లుఓ, యంపిడిఓ, డిఆర్డిఓ లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, మనఊరు- మనబడి కార్యక్రమంలో

భాగంగా జిల్లాలోని అన్నిప్రభుత్వం పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలలో మౌళిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.  అంగన్ వాడి కేంద్రాలలో త్రాగునీరు, మరుగుదొడ్లు,విధ్యుత్  వంటి కనీస వసతులు  ఉండాలని, మిషన్ భగీరథ ద్వారా తక్షణమే నీటి వసతి కల్పించాలని, మరుగుదొడ్లు లేని ప్రభుత్వ పాఠశాలలో వెంటనే ఉపాధిహామి లేదా ఇతర నిధులను వినియోగించి మంజూరు తీసుకోవాలని, పాఠశాలలో నిధులు ఉన్నట్లయితే పాఠశాల నుండి లేదా నేరుగా ధరఖాస్తు చేసి పొందాలని అన్నారు. వసతుల కల్పన కొరకు అవసరమైన ప్రతిపాధనలు గ్రామాలలో ఎంపిడిఓలకు మున్సిపల్ కమీషనర్లకు పంపాలని సూపర్ వైజర్లు, సిడిపిఓలను అదనపు కలెక్టర్ ఆదేశించారు.

అంగన్ వాడి సెంటర్ లలో మిషన్ భగీరథ పథకం ద్వారా బోర్ వెల్ సౌకర్యాన్ని కల్పించాలని, పైపులైను సరిగా లేని చోట మరమత్తులు చేయించాలని అన్నారు.  న్యూట్రిషన్ గార్డెన్లు  ఉండేలా చూసుకోవాలని అన్నారు. బోర్ వెల్ సౌకర్యం ఉండే విధంగా అంగన్ వాడి కేంద్రాలలో ఉపాధిహామి కూలీల ద్వారా అన్ని మండల, గ్రామాలలో అవసరమైన పనులు చేయించుకోవాలని ఆధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జట్పి సిఈఓ ప్రియాంక, విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు, మెప్మా పిడి రవీందర్,  డిర్డిడిఓ పిడి శ్రీలత రెడ్డి, జిల్లా వెనకబడిన తరగతుల అధికారి రాజమనోహార్ రావు, షెడ్యూల్ కులాల అభివృద్ది అధికారి నతానియల్,  పంచాయితిరాజ్ ఇఇ, యంఈఓలు, ఏఈ లు ఎల్డియం తదితరులు పాల్గోన్నారు.

Share This Post