ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలను భాగస్వామ్యులను చేయాలి :  ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ శాసనసభ్యులు బాల్క సుమన్‌

ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ ప్రతి పథకం పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన సమావేశ హాలును జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి, జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, శాసన మండలి సభ్యులు పురాణం సతీష్‌, మంచిర్యాల, బెల్లంపల్లి శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, ట్రెనీ కలెక్టర్‌ ప్రతిభా సింగ్‌లతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలను పారదర్శకంగా అమలు చేస్తూ అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎం.ఎల్‌ ఎ., ఎం.పి., సింగరేణి నిధుల నుండి 4 కోట్ల రూపాయలతో జిల్లాలో అన్ని మహిళా సంఘాలకు భవనాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేయడం జరుగుతుందని, చెన్నూర్‌ నియోజకవర్ల పరిధిలో వివిధ రకాల అభివృద్ధి పనులను 9 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ అభివృద్ధి పనులను ఈ కమిటీల ద్వారా ప్రజలకు తెలిసేలా అన్ని సంఘాలలో సి.ఎ.లు, సర్పంచ్‌లు,
పంచాయతీ కార్యదర్భులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని పనుల సంబంధిత కార్యచరణ రూపొందించుకొని ప్రణాళికబద్దంగా పనులు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో ప్రజలను భాగస్వామ్యులను చేయాలని, ఆశ, అంగన్‌వాడీ, రేషన్‌ డీలర్లు అందరితో సమావేశం ఏర్పాటు చేయాలని, అధికారులు ప్రజలకు జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలని తెలిపారు. జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. జరిగిన ప్రతి పనికి సంబంధించిన నివేదిక ప్రతి జిల్లా పరిషత్‌ సమావేశంలో అందరికి తెలియజేయాలని, ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ ప్రత్యేక చొరవతో వ్యవసాయంతో పాటు అన్ని రంగాల అభివృద్ధిలో ముందుకు వెళుతుందని, అధికార యంత్రాంగం ప్రజా సంక్షేమానికి అహర్నిశలు కృషి చేయడం అభినందనీయమని అన్నారు. కూరగాయలు, పండ్ల తోటల పెంపకంపై జిల్లాలో రైతులను ప్రోత్సహించాలని, సాగుకు అవసరమైన మెళకువలు, సూచనలు అందించాలని, జిల్లాలో రోడ్ల ఏర్పాటులో అటవీ శాఖ సంబంధిత అనుమతులను పరిశీలించి త్వరగా మంజూరు చేయాలని తెలిపారు. జిల్లాలోని జైపూర్‌ మండల శివారులో 150 కోట్ల రూపాయల వ్యయంతో మ్యాట్రిక్‌ సంస్థ సమన్వయంతో ఫామ్‌ ఆయిల్‌ ఫ్యాక్టరి మంజూరు జరిగిందని, జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌ ఫామ్‌ తోటల సాగు జరిగేలా సంబంధిత శాఖల అధికారులు రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. 57 సం॥లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరు ఈ నెల 31వ
తేదీ లోగా వృద్దాప్య ఫించన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో 16 నెలల తరువాత సెప్టెంబర్‌ 1వ తేదీన ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు ప్రారంభించడం ఒక ప్రత్యేక డైవ్‌గా తీసుకోవాలని, ప్రతి పాఠశాల, కళాశాలలో పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టాలని, ఫర్నీచర్‌, ఆవరణ, తరగతి గదులు శుభ్రంగా ఉంచాలని, నీటి నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని, నల్లా కనెక్షన్‌ లేని చోట ఏర్పాటు చేయడంతో పాటు మధ్యాహ్న భోజనం అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని తెలిపారు. ప్రతి గ్రామంలో పాఠశాలలు, ఆసుపత్రుల బాధ్యత గ్రామపంచాయతీలదేనని, ప్రభుత్వ నిధుల నుండి అన్ని విధాలుగా ఈ నెల 80వ తేదీ లోగా ప్రధానోపాధ్యాయులు ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని తెలిపారు. మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి పనులను అధికారులు ప్రజాప్రతినిధులు, ప్రజల సమన్వయంతో నిర్వహించాలని, గ్రామాలలో ఉన్న ఇనుప విద్యుత్‌ స్తంభాల స్థానంలో సిమెంట్‌ స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్‌ ప్రమాదాలను నివారించాలని తెలిపారు. బెల్లంపల్లి శాసనసభ్యులు మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో స్థానిక సిబ్బందిని నియమించాలని, అధికారులు విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్‌, జిల్లా గ్రంథాలయ సంస్ధ వైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌, డి.సి.ఎం.ఎస్‌. వైర్మన్‌ తిప్పని లింగయ్య, అన్ని శాఖల జిల్లా అధికారులు, జెడ్‌.పి.టి.సి.లు, మండల అధ్యక్షులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post