ప్రెస్ రిలీజ్
జనగామ జిల్లా, జనవరి 21
ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ముందజంలో జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య
శనివారం నాడు జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ ఛైర్మెన్ పాగాల సంపత్ రెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్ పాలకవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ముఖ్య అతిథిలు గా జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, లు హాజరైయ్యారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు,అభివృద్ధి పనులు ప్రజలకు చేరవేయడంలో జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది,ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతున్నామని మరింత వేగంతో పని చేస్తామని అన్నారు. జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం, వైద్య ఆరోగ్య సేవలు, ఇతర కార్యక్రమాలు విజయవంతంగా పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నామన్నారు,
జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, మాట్లాడుతూ జిల్లాలో రైతు సేవలు, కరెంట్ సమస్యల పరిష్కారం, పౌర సరఫరాల సేవలు, విద్య,వైద్య ఆరోగ్య సేవలు, గ్రామాల్లో చేపట్టే వివిధ అభివృద్ధి పనులపై జిల్లా పరిషత్ సభ్యులు, ప్రజా ప్రతినిధుల సూచనలు, సమస్యలు ఉంటే పరిశీలించాలని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలన్నారు.
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి పెండిగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు, కరెంట్ కు సంబంధించిన సేవల గురించి, మన ఊరు మనబడి పనులు, పౌర సరఫరాల సేవలు, వైద్య ఆరోగ్య శాఖ సేవలు జిల్లా ప్రజలకు ఏలాంటి సహాయం ఐనా వెంటనే స్పందించి సేవలు అందించాలని సంబంధిత అధికారులను కోరారు,
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మాట్లాడుతూ జిల్లాలో ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు మరింత వేగంతో ఏలాంటి సమస్యలు రాకుండా అధికారులు సిబ్బంది పని చేయాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా పరిషత్ సభ్యులు జెడ్పీటీసీలు,ఎంపిపిలు, జెడ్పీ సీఈవో ఎన్. వసంత, ఎన్పిడిసిఎల్ ఎస్ఈ వేణు మాధవ్, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. రాం రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఏ.మహేందర్, జిల్లాలో నీ అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు..