ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ది మాదిరిగానే ఉచిత న్యాయసేవలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేందుకు జిల్లా యంత్రాంగం సహాకారం అవసరమని తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ శ్రీమతి వై రేణుక అన్నారు.

ప్రచురణార్ధం

అక్టోబరు, 27,ఖమ్మం –

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ది మాదిరిగానే ఉచిత న్యాయసేవలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేందుకు జిల్లా యంత్రాంగం సహాకారం అవసరమని తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ శ్రీమతి వై రేణుక అన్నారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ అక్టోబరు 2 నుండి నవంబరు 14 వరకు చేపట్టిన పాన్ ఇండియా క్యాంపెయిన్లో భాగంగా ఈ నెల 30వ తేదీన ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో నిర్వహించనున్న మోడల్ లీగల్ సర్వీసెస్ క్యాంపు పట్ల జిల్లా, మండల స్థాయి అధికారులు, పోలీసు, అధికారులకు కలెక్టరేట్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించి, లీగల్ సర్వీసెస్ మోడల్ క్యాంపును విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ శ్రీమతి వై రేణుక మాట్లాడుతూ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హాక్కులతో పాటు అర్టికల్-39లో పొందుపర్చిన వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, నేరారోపణ చేయబడి ఆర్ధిక. స్తోమత లేని వ్యక్తులు ఉచితంగా న్యాయసేవాధికార సంస్థ ద్వారా న్యాయసేవలు పొందే వెసులుబాటు లీగల్ సర్వీసెస్ యాక్టు చట్టం ద్వారా చేయబడిందన్నారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల న్యాయసేవాధికార వ్యవస్థలు ఉచిత న్యాయసేవలు అందిస్తున్నాయని, ఉచిత న్యాయ సేవ సంస్థల పట్ల ప్రజలకు విస్తృత అవగాహనపర్చి చైతన్యపర్చేందుకు 43 రోజుల వ్యవధిలో రాష్ట్రంలోని 12,726 గ్రామ పంచాయితీలలో ప్రతి గ్రామ పంచాయితీని మూడు సార్లు సందర్శించి సమాజంలోని ప్రతి ఒక్కరికి న్యాయసేవలు అందుబాటులోకి తెచ్చే కార్యక్రమాన్ని చేపట్టామని ఆమె తెలిపారు. అందరికి న్యాయం, అందుబాటులోకి న్యాయం లక్ష్యాలు నెరవేరాలంటే ప్రజలకు ఉచిత న్యాయసేవల గురించి తెలియాల్సిన అవసరం ఉందని, దారిద్య్ర రేఖకు దిగువ ఉన్నవారు కేవలం 30 శాతం మంది మాత్రమే ఉచిత న్యాయసేవలు పొందుతున్నారని, మిగిలిన 70 శాతం మంది కూడా ఉచిత న్యాయసేవలు పొందే విధంగా సమాజంలో మార్పురావాలని శ్రీమతి రేణుక అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధితో పాటు ఉచిత న్యాయసేవల లబ్ధిని కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించేందుకు జిల్లా, మండల స్థాయి అధికారులు, పోలీసు శాఖ పారాలీగల్ వాలంటీర్లకు, ప్యానల్ లాయర్స్కు సహకరించాలన్నారు. వార్షిక ఆదాయం 3 లక్షల కంటే తక్కువ ఉన్నవారందరూ, అదేవిధంగా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, మానసిక వైకల్యం కలిగినవారు, కార్మికులు మొదలగువారందరూ ఉచిత న్యాయసేవలు పొందడానికి అర్హులని, ప్రస్తుత పరిస్థితులలో మార్పును తెచ్చి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి అర్హులందరికి ఉచిత న్యాయసేవలు అందించాలని ఆమె అన్నారు. దీనితోపాటు బాధితులకు పరిహారం చెల్లించే విషయంలో కూడా వ్యక్తికి జరిగిన నష్టాన్ని బట్టి 10 లక్షల వరకు నష్టపరిహారం అందించే వెసులుబాటు ఉందని, 2018వ సంవత్సరంలో వచ్చిన షెడ్యూల్డు ప్రకారం పరిహారం కోసం తెల్లకాగితంపై దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని, ఇట్టి సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని ఆమె కోరారు. న్యాయసేవాధికార సంస్థ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయసేవల లబ్దిని అందించేందుకు ఈ నెల 30వ తేదీన తల్లాడ మండల కేంద్రంలో నిర్వహించనున్న మోడల్ లీగల్ సర్వీసెస్ క్యాంప్లో ఎక్కువ మంది ప్రజలు లబ్ధి పొందేవిధంగా జిల్లా, మండల, గ్రామ స్థాయిలో విస్తృత ప్రచార కార్యక్రమాలు గావించాలని, వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్టాల్స్ ఏర్పాటు చేసి, ఆస్తులు, ఋణాలు దివ్యాంగుల ఉపకరణాలు, ఇతర లబ్ధి చేకూర్చే కార్యక్రమాలను చేపట్టి లీగల్ సర్వీసెస్ మోడల్ క్యాంపు విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ శ్రీమతి రేణుక కోరారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ జావీద్ పాషా, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూధన్, అడిషనల్ డి.సి.పిలు సుభాష్ చంద్రబోస్, కె.ప్రసాద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఇంచార్జ్ జిల్లా పంచాయితీ అధికారి అప్పారావు, బాలల హక్కుల సంరక్షణ జిల్లా అధికారి విష్ణువందన, జిల్లా సంక్షేమ శాఖాధికారి సంధ్యారాణి, జిల్లా ఉపాధికల్పనాధికారి కె.శ్రీరామ్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి కె.సత్యనారాయణ, ఏ.సి.పిలు ఆంజనేయులు, బస్వారెడ్డి, రామోజీరమేష్, జిల్లా, మండల స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.

Share This Post