ప్రభుత్వ ఆదేశాలు మేరకు వివిధ శాఖలలో భర్తీ చేయనున్న విఆర్వోలను తక్షణం చేర్చుకొని రిపోర్ట్ చేయాలని జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు.
సోమవారం జిల్లాకల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జరిగిన జిల్లా అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన ప్రభుత్వ శాఖలలో వీఆర్వోలను సర్దుబాటు చేసేందుకు గాను నిర్వహించిన లాటరీ పద్ధతి ద్వారా వారిని మంగళవారం మధ్యాహ్నం లోపు చేర్చుకొని రిపోర్టును జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అన్ని శాఖల అధికారులు పంపాలని ఆదేశించారు. జిల్లాలో 95 మందికి ఆర్థిక శాఖ ఉత్తర్వుల మేరకు ఆయా శాఖలలో భర్తీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వి ఆర్ ఓ లకు సంబందించిన ప్రోసిడింగ్ కాఫీలను ఈ రోజు సాయంత్రం అందజేస్తామని , వివిధ శాఖలకు కేటాయించబడిన వివరాలు
వ్యవసాయ ,సహకార శాఖ 4
పశు సంవర్ధ క శాఖ 3
వెనుకబడిన తరగతులు 1
అటవీ శాఖ 1
ఫైనాన్స్ 3
వైద్య శాఖ 3
ఉన్నత విద్య 21
హోమ్ శాఖ 3
అగ్ని మాపక 1
ఇరిగేషన్ 2
మైనార్టీ 1
మున్సిపల్ 1 7
పంచాయతీ రాజ్ 21
మిషన్ బగిరథ 2
సెకండరి ఏడ్యూకేషన్ 2
R&B రవాణా 2
మహిళా శిశు సంక్షేమ శాఖ 1
కార్మిక శాఖ 1
ఉపాది కల్పన 2
అబ్కారి,స్టేట్ టాక్సెస్ 4
సమావేశం లో జిల్లా అడిషనల్ ఎస్ పి రాములు నాయక్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారీ చేయబడినది