తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ పొట్లపల్లీ కేశవ రావు సోమవారం వేకువ జామున యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార లాంచనలతో జస్టిస్ పి.కేశవరావు అంత్యక్రియలను రాయదుర్గం మహా ప్రస్థానంలో నిర్వహించడం జరిగింది.
ఈ అంత్యక్రియల్లో దేవాదాయ శాఖ మంత్రి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ హాజరై నివాళులు అర్పించారు.