ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల పై రివ్యూ చేసిన జిల్లా కలెక్టర్

ప్రచురణార్థం —5
ప్రభుత్వ ఆసుపత్రిలలో ప్రసవాల సంఖ్యను పెంచాలి ::జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
విధులకు సకాలంలో వైద్యులు హాజరు కావాలి
100% గర్భిణుల వివరాలు కెసిఆర్ కిట్ లో నమోదు చేయాలి
వ్యాధి నిరోధక టీకాలను 3.5 మాసాల నుంచి 9 మాసాల పిల్లలందరికీ వేయాలి
గ్రామ హెల్త్ రిజిస్టర్ లను రెండు వారాలు పూర్తి చేయాలి
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పై కలెక్టర్ సమీక్ష
పెద్దపల్లి సెప్టెంబర్ 09:-.
జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలలో ప్రసవాల సంఖ్య పెంచాలని, ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పై కలెక్టర్ గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలని,పేదింటి గర్భీణీ స్త్రీలకు ఆర్థిక సహాయం చేయడమే కాకుండా మాతా శిశు సంరక్షణ జరుగుతుందని కలెక్టర్ అన్నారు. కేసిఆర్ కిట్ అమలు పురొగతిని కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా జన్మించే వారి వివరాలను ఈ-బర్త్ లాగిన్ లో నమోదు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే కేసులలో హై రిస్క్ కేసులను ఎక్కువ శ్రద్ద చుపించాలని, ప్రాథమిక ఆరొగ్య కేంద్రాలలో సైతం ప్రసవాలు నిర్వహించాలని, అక్కడ సాధారణ ప్రసవాల నిర్వహణ కోసం అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నందున, అట్టి అంశాన్నీ ప్రజలలో విస్తృతంగా తీసుకొని వెళ్లాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. విధి నిర్వహణలో వైద్యులు అజాగ్రత్త వహించడానికి వీలు లేదని, జిల్లా వైద్య శాఖ ఉన్నతాధికారులు ప్రాథమిక ఆరొగ్య కేంద్రాలను తనిఖీ చేయాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. గర్భీణి స్త్రీలకు వారి ఇంటి వద్దకు తప్పనిసరిగా సేవలు అందాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రాథమిక ఆరొగ్య కేంద్రాలలొ వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని గర్భిణుల వివరాలను నూరుశాతం కెసిఆర్ కిట్ లో నమోదు చేయాలని సూచించారు వ్యాధి నిరోధక టీకాలను జిల్లాలోని 3.5 నుంచి తొమ్మిది మాసాల వయసు గల పిల్లలందరికీ వేయాలని, గ్రామాల్లో హెల్త్ రిజిస్టర్ లను పకడ్బందీగా నిర్వహించాలని వాటిని రెండు వారాలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా వైద్యారొగ్య అధికారి డా.ప్రమోద్ కుమార్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కృపాబాయి, పి. హెచ్. సి. డాక్టర్లు,సంబంధిత అధికారులు, తదితరులు ఈ సమీక్షలో పాల్గోన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి, పెద్దపల్లి గారిచే జారీచేయబడినది.

Share This Post