ప్రభుత్వ ఆసుపత్రిలో లో మెరుగైన వైద్య సేవలు:: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం…..1

తేదీ.7.1.2022

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు:: జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల, జనవరి,7:- ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతనమైన వైద్య పరికరాలను ఏర్పాటు చేసుకొని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జి.రవి అన్నారు. శుక్రవారం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ నిధులతో పాటు హైదరాబాదులోని మాదాపూర్ కు చెందిన నిర్మాణ్ సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన 12 గదులు తో కూడిన ఐ సి యూ గదిని మరియు డిజిటల్ ఎక్స్ రే యంత్రాన్ని కోరుట్ల శాసనసభ్యులు మరియు టి.టి.డి.బోర్డు మెంబెర్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కరోన సమయంలో ఐ సి యూ గదులు లేనప్పటికీ వైద్యులు సమర్థవంతంగా సేవలు అందించారని.ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తి గా వైద్య సేవలు అందించాలని, ఈ ఐ.సి.యు. బెడ్ల ఏర్పాటుకు తోడ్పాటు అందించిన నిర్మాన్ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ దవాఖానాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందన్నారు. ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ , మున్సిపల్ అధ్యక్షురాలు సుజాత, డి.ఎమ్.హెచ్.ఓ శ్రీధర్, సూపరిండెంట్ సాజిద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైద్యులు,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం జగిత్యాల చే జారీ చేయనైనది.

Share This Post