ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు విస్తృతంగా అందించాలి….

ప్రచురణార్ధం

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు విస్తృతంగా అందించాలి….

మహబూబాబాద్, 2021 డిసెంబర్-23:

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను విస్తృతంగా అందించాలని జిల్లా కలెక్టర్ శశాంక వైద్య అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా ఏరియా ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు, మెడికల్ కళాశాలకు అనుబంధంగా చేస్తున్న ఏర్పాట్లతో పాటు, ఆసుపత్రి విస్తరణ పనులు, ఆరోగ్యశ్రీ, సర్జరీలు, డయాలసిస్, తదితర అంశాలపై వైద్య, ఏజెన్సీ అధికారులతో సమీక్షించారు.

ఆసుపత్రిలో చేపట్టిన అదనపు పడకల విస్తరణ పనులు ఆశించిన విధంగా పూర్తి కావడం లేదని, పనుల ప్రగతి అనుకున్న స్థాయిలో లేదని tsmidc అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం గా చేపట్టి త్వరితగతిన పూర్తి అయ్యే లా చర్యలు తీసుకోవాలన్నారు.

ఆసుపత్రిలో బయోమెట్రిక్ ఎర్పాటు చేసి, వైద్యులు, వైద్య సిబ్బంది హాజరును నమోదు చేయాలని తెలిపారు. అన్ని ఎంట్రన్స్ లలో బయో మెట్రిక్ సిస్టమ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.

వచ్చే విద్యా సంవత్సరానికి వైద్య కళాశాల తరగతులు ప్రారంభం కానున్న దృష్ట్యా చేపట్టాల్సిన పనులు, ఏర్పాట్లను విభాగాల వారీగా సమీక్షించారు.

టి. Diagnostic సేవలను పెంచాలని, వచ్చిన వారికి ఆసుపత్రి లాబ్ లోనే అన్ని పరీక్షలు చేయాలని, టెస్ట్ ల కొరకు బయటకు పంపరాదన్నారు.

ఓ.పి. సేవలను పెంచాలని, కంటి ఆపరేషన్లు, సర్జరీలు, ప్రసవాలు, ఇతర ఆరోగ్య సేవలు అందిస్తున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల కొరకు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగా అందించి ప్రభుత్వ వైద్యం పై నమ్మకం పెంచాలన్నారు. ఆసుపత్రికి కావాల్సిన సౌకర్యాలపై ప్రతిపాదనలు అందించాలన్నారు.

O.P.సేవలలో డాక్టర్ prescription ప్రకారం వారికి అన్ని మందులు అందించాలని అన్నారు.

ఆసుపత్రిలో ఉన్న పరికరాల జాబితా తయారు చేయాలన్నారు. పనిచేస్తున్న, పనిచేయని మెషినరీ జాబితాను ఇవ్వాలని, ఆసుపత్రి కొరకు అదనంగా అవసరమైన వాటి వివరాలను ఇవ్వాలని అన్నారు.

ఆరోగ్యశ్రీ లో సేవలను అందించడంతో పాటు, అన్ని విభాగాల్లో సేవలను పెంచాలని, మెడికల్ కళాశాలకు అనుబంధంగా మెరుగైన సేవలు అందించే విధంగా సన్నద్ధంగా ఉండాలన్నారు.

శానిటేషన్ ను పర్యవేక్షిస్తూ ఆసుపత్రి పరిశుభ్రంగా ఉండేటట్లు చూడాలని, వారికి కూడా బయో మెట్రిక్ విధానంలో హాజరు తీసుకోవాలన్నారు.

కోవిడ్ Pediatric వార్డ్, icu ఏర్పాటు చేయాలన్నారు.

ఆసుపత్రిలో blood bank, sanitation, diet, pharmacy, planning, sncu, icu, డయాలిసిస్ కమిటీ లను ఏర్పాటు చేసి
మెరుగైన సేవలను అందిస్తున్నామని ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ బి.వెంకట్రాములు జిల్లా కలెక్టర్ కు వివరించారు.

ఓ. పి., Procurement కు కమిటీ లను ఏర్పాటు చేయాలని, వార్డ్ లలో ఎన్ని బెడ్స్ ఖాళీ ఉన్నాయి, భర్తీ ఎన్నిఅయ్యాయి display చేయాలని,
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ jadhav, ఆసుపత్రి లో పని చేస్తున్న విభాగాల వైద్యాధికారులు సి. హెచ్. రమేష్, M.Surya Kumari, G.Balu Naik, S.Raj Kumar, B.Laxman, S.Srinivas Rao, K.Satyanarayana, N.Bhavani, Rajesh, Bhargav, తదితరులు పాల్గొన్నారు.
——————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post