ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు, వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి షా

 

ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు, వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి షా
సూచించారు.
మంగళవారం నాడు రాజర్షి కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రి సూపరిండెంట్ లు, ఆర్ ఎం వో లు,డి సిహెచ్ ఎస్, ఫుడ్ సప్లై కాంట్రాక్టర్లు, శానిటేషన్ కాంట్రాక్టర్లు, డైటీషియన్, కాయకల్ప, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు పెరగాలన్నారు . సాధారణ ప్రసవాలు మరింతగా పెంచాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో
ఆరోగ్యశ్రీ ,ఆయుష్మాన్ భారత్ లో అందించిన వైద్య చికిత్సల వివరాలను ఆరోగ్యశ్రీ లో నమోదు చేయాలని సూచించారు.
ఆస్పత్రులలో రోగులకు అందించే ఆహారాన్ని ముందుగా ఆసుపత్రి సూపరిండెంట్/ఆర్ఎంఓ రుచి చూడాలని సూచించారు. నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని రోగులకు అందించాలని ఫుడ్ కాంట్రాక్టర్కు ఆదేశించారు. ఆసుపత్రి లోపల పరిసరాలు బయట పరిశుభ్రంగా ఉండాలని, నిబంధనల మేరకు పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలని పారిశుద్ధ్య నిర్వహణ కాంట్రాక్టర్కు ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికుల హాజరును ప్రతిరోజు చెక్ చేయాల్సిన బాధ్యత ఆసుపత్రి సూపర్డెంట్ దని స్పష్టం చేశారు.
ప్రభుత్వ వైద్యులు సిబ్బంది నిర్ణీత సమయం పాటు ఆస్పత్రిలో ఉండాలని స్పష్టం చేశారు.
అన్ని పీహెచ్సీలలో డాక్టర్లు ఉదయం 9 నుండి సాయంత్రం 4గంటల వరకు విధుల్లో ఉండాలన్నారు. సి హెచ్ సి, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆస్పత్రిలో డాక్టర్లు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు అందుబాటులో ఉండాలని తెలిపారు. సమయపాలన పాటించని వారిపై చర్యలు తప్పవన్నారు.
విభాగాల వారీగా ఉన్న ఖాళీల భర్తీకి నివేదిక అందజేయాలని సూచించారు. ప్రతి నెల ఆయా స్పెషలిస్టు డాక్టర్ల వారీగా, నర్సుల వారిగా పనితీరును సమీక్షిస్తామని వెల్లడించారు.
ప్రభుత్వాసుపత్రుల పై ప్రజలకు నమ్మకం కలిగించాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించి భరోసా కల్పించాలని సూచించారు. రోగుల పట్ల నిర్లక్ష్యం పనికిరాదన్నారు.

ఈ సమావేశంలో డి సి హెచ్ ఎస్ డా.సంగారెడ్డి, ఏరియా ఆస్పత్రిల సూపరిండెంట్ లు,అర్ ఎం ఓ లు, ఆరోగ్యశ్రీ, కాయకల్ప కోఆర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post