ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు మరింతగా పెంచాలి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు మరింతగా పెంచాలి

బర్త్ ప్లానింగ్ పై ఫోకస్ పెట్టీ అన్నీ కాన్పులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరగాలి

– ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీ ల సంఖ్యను పెంచాలి

– మొదటి కాన్పుల పై ప్రత్యేక దృష్టి సారించాలి

– పెండింగ్ ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణాల ను ఫిబ్రవరి లోగా పూర్తి చేయాలి

– కంటి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలి

– జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

——————————-

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు సాధ్యమైనంత ఎక్కువగా పెరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

శనివారం సాయంత్రం కలెక్టరేట్ మినీ మీటింగ్ హల్ లో వైద్య ఆరోగ్య శాఖ పథకాల పై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..
జిల్లాలో బర్త్ ప్లానింగ్ పై వైద్యాధికారులు
ప్రత్యేక ఫోకస్ అన్ని
కాన్పులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరిగేలా చూడాలనీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.
సాధారణ ప్రసవాలు పెంచేందుకు తొలి కాన్పులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
క్రమం తప్పకుండా పురోగతి పై సమీక్ష సమావేశాలు నిర్వహించాలని అన్నారు.
జిల్లాలో క్షయ వ్యాధి బాధితులను గుర్తించి చికిత్స అందించాలని చెప్పారు.. ప్రైవేట్ ఆస్పత్రులలో టీబీ నిర్దారణ అయిన కేసులను ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి,వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు.

జిల్లాలో కంటి వెలుగు రెండో విడత కింద ఇప్పటి వరకు 22 వేల మందికి పరీక్షలు చేశారని… మిగతా ప్రజలకు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం చేయాలన్నారు. జిల్లాకు మంజూరైన 35 సబ్ సెంటర్ భవన నిర్మాణాల కు గాను ఇప్పటివరకు 25 మాత్రమే పూర్తయ్యాయని మిగతా ఫిబ్రవరి లోగా పూర్తి చేయాలన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రగతిలో ఉన్న ఎన్ క్వాస్ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, జిల్లా డిప్యూటీ వైద్యాధికారులు డా శ్రీ రాములు, EE PR సూర్య ప్రకాష్, జిల్లా ఆసుపత్రి, వేములవాడ ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ మురళీధర్ రావు, డా మహేష్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు పాల్గొన్నారు.

Share This Post