ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయిలో మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు

అందిస్తున్నా మనడానికి సమ్మయ్య కు నిర్వహించిన ఫేషియల్ రీ కన్స్ట్రక్షన్ సర్జరీ నిదర్శనని,  తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో వైద్య రంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పారనడానికి నిదర్శనం ఈ ఘటన అని,  అరుదైన శస్త్ర చికిత్సతో సమ్మయ్య ప్రాణాలు కాపాడిన జిల్లా  ఆసుపత్రిలో ఈఎన్ టి వైద్యాధికారి  డా రవిబాబుతో పాటు అతని  వైద్య బృందాన్ని అభినందించిన రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. అక్టోబర్ 26వ తేదీన పాల్వంచ మండలం, రేగులగూడెం గ్రామానికి చెందిన మొక్కటి సమ్మయ్య, వయస్సు 58,  మేతకు పశువులను  అడవికి తీసుకెళ్లిన సమయంలో  అడవిదున్న దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని ముక్కు ఛిద్రమై, ముక్కు పక్క టెముకలు విరిగడంతో పాటు ముఖ భాగంలో మాంసం ఊడిపోయి ప్రాణాపాయ స్థితిలో వైద్య చికిత్సల కొరకు జిల్లా ఆసుపత్రిలో చేరాడు. డా రవిబాబు నేతృత్వంలోని వైద్య బృందం ఫేషియల్ రీ కన్స్ట్రక్షన్ సర్జరీ నిర్వహించి మునుపటి సమ్మయ్య ను పూర్వ స్థితికి  తీసుకొచ్చిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్,  జిల్లా కలెక్టర్ అనుదీప్ మారుమూల ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలో వైద్యుల  సేవలను ప్రశంసించారు. 18 రోజుల చికిత్సలు అనంతరం సమ్మయ్య ఆసుపత్రి నుండి పూర్తి ఆరోగ్య వంతునిగా కోలుకుని ఇంటికి తిరిగి వెళ్లడం చాలా సంతోషమని చెప్పారు. ఇదే చికిత్స ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్వహిస్తే దాదాపు 10 లక్షల వరకు ఖర్చు అవుతోందని సమ్మయ్య కు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించామని  డా రవిబాబు చెప్పారు.

Share This Post