ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు ప్రజలకు చేరువ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు ప్రజలకు చేరువ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.సోమవారం రంగారెడ్డి జిల్లా, జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలిసి రంగారెడ్డి జిల్లా ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న మెడికల్ ఏక్విప్మెంట్ ను మరమ్మత్తులు కు గురి అయితే 24గంటలలో మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు. వైద్య పరికరాల నిర్వహణకు ఇందుకోసం ఇరవై కోట్లు కేటాయించినట్లు తెలిపారు పారిశుధ్యం, డైట్ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా మెరుగు అయ్యాయని అన్నారు త్వరలోనే 13వేల డాక్టర్ల ఖాళీల భర్తీ చేస్తామని, నూతనంగా నియామకాల ద్వారా వచ్చే డాక్టర్ లకు ప్రవైట్ ప్రాక్టీస్ నిషేదిస్తూ, విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ నిబంధన కొత్త డాక్టర్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసారు. దేశంలో ప్రజలకు ఉచిత డయాలసిస్ వైట్ అనిపిస్తున్నది ఒక తెలంగాణ రాష్ట్రమేనని, కావున ప్రభుత్వ వైద్యులు తమ సేవలను మరింత మెరుగుపరుచుకోవాలని తెలిపారు. డాక్టర్లు సంవత్సరంగా మందులు బయటకు రాయకూడదు అని ప్రభుత్వ ఆస్పత్రులను మందుల కొరత లేదని మందులకు 200 కోట్ల నుండి 500 కోట్ల రూపాయలు పెంచడం జరిగిందని తెలిపారు ప్రభుత్వం మంజూరు చేసిన వైద్య పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగించాలని శానిటేషన్ క్వాలిటీ పెంచేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.అనవసరంగా సిజేరియన్ల ఆపరేషన్లు చేయవద్దని కోరారు. సిజేరియన్ ఆపరేషన్ సి సెక్షన్ లో తెలంగాణ రాష్ట్రం ముందు ఉండటం దురదృష్టకరమని అన్నారు.సి సెక్షన్ పారామీటర్లలో మాత్రం 62 శాతంలో మనం ముందున్నామని, దీనిని తగ్గించాలని, గ్రామ స్థాయి నుండి ఆశా వర్కర్స్, వైద్య సిబ్బంది సమన్వయంతో మోటివేట్ చేయాలని తెలిపారు. డెలివరీ అయిన తర్వాత మొదటి గంట గోల్డెన్ అవర్ అని, ఆ గంటలో శిశువులు తల్లి పాలకు
దూరమవుతున్నారని గోల్డెన్ అవర్లో తల్లిపాల వలన చురుకుగా, శారీరకంగా రోగనిరోధక శక్తిని కలిగి వుంటారని, ఎదుగుదల వుంటుందని, మొదటి గంట తల్లి పాలు ఎన్ని కోట్లు పెట్టినా కొనలేమని, జీవితంలో తిరిగి ఇవ్వలేమని తెలిపారు. మన రాష్ట్రంలో 36 శాతం మాత్రమే మొదటి గంట తల్లిపాలు తాగుతున్నారని, 64 శాతం దూరమవుతున్నారని, దీనికి ప్రధాన కారణం సిజేరియన్ ఆపరేషన్లు, తద్వారా తల్లి రికవరీ రేటు తక్కువగా వుంటుందని, తల్లికి బిడ్డకు నష్టం కలుగుతుందని అన్నారు. కొన్ని ఆసుపత్రులలో ముహూర్తాలు చూసుకొని ఆపరేషన్లు చేస్తున్నారని, సహజంగా దేవుడిచ్చిన ప్రకృతి పద్దతిలో సాధారణ డెలివరీల పట్ల ప్రజలలో, ముఖ్యంగా గర్భిణీ స్త్రీల కుటుంబ సభ్యులలో అవగాహన కల్పించాలని తెలిపారు.ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి మీటింగ్ లో సిజేరియన్ ఆపరేషన్ల వలన కలిగే దుష్పరిమాణాలు తెలుపాలని, సాధారణ ప్రసవాలు పట్ల ప్రోత్సహించాలని అన్నారు. ప్రయివేటు ఆసుపత్రులలో వందకు వంద శాతం సి సెక్షన్లు చేస్తున్నారని, ఇది ఇక నుండి తగ్గించాలని కోరుతున్నానని అన్నారు. జిల్లాలో కొత్తగా మంజూరు అయిన 22 బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకు రావాలని అన్నారు.జిల్లాలో నూతనంగా ఇబ్రహీంపట్నం, కొండాపూర్, చేవేళ్ల ఆసుపత్రులలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనలను పంపాలని కలెక్టర్ కు సూచించారు.
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో ఆర్థొపెడిక్, కంటి పరీక్షలు నిర్వహించుటకు శిబిరాలు నిర్వహించి మెరుగైన వైద్యసేవలు అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా సమీక్షించారు.

ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ వాణి దేవి, జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్ అనితా హరినాథ్ రెడ్డి, ప్రభుత్వం విప్ మరియు శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆర్ కె పూడి గాంధీ, ఎల్.బి.నగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి, రాజేందర్ నగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచి రెడ్డి కిషన్ రెడ్డి, షాద్ నగర్ శాసనసభ్యులు అంజయ్య యాదవ్, చేవేళ్ల శాసనసభ్యులు కాలె యాదయ్య, ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, డాక్టర్ రమేష్ రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్వరాజ్య లక్ష్మి, డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

 

Share This Post