ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు వైద్య, ఫ్రంట్ లైన్ వర్కర్లుకు బూస్టర్ ప్రక్రియ ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు

. బూస్టర్ డోస్, రెండో డోస్ వ్యాక్సిన్, చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహణపై వైద్య సిబ్బందితో సోమవారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ 40 ఆరోగ్య కేంద్రాల్లో జరుగుతున్నట్లు చెప్పారు. ఫ్రంట్ లైన్ వర్కర్లుతో పాటు 60 సంవత్సరాలు దాటిన వారితో పాటు దీర్ఘకాలిక వ్యాధులున్న వారు 90 వేల వరకు ఉన్నారని, వీరందరికీ బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్లు చెప్పారు. బూస్టర్ డోస్ ఇవ్వాల్సిన వారిలో ఆరోగ్య సిబ్బంది 8 వేలు, ఫ్రంట్లెన్ వర్కుర్లు 9 వేల మంది మొత్తం 1.07 లక్షన్నట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రాధమిక, కమ్యూనిటి, ఏరియా ఆసుపత్రితో పాటు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో బూస్టర్ డోస్ వేయు ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. రెండవ డోస్ వ్యాక్సిన్ ఇంకా 95 వేల మందికి ఇవ్వాల్సి ఉన్నదని చెప్పారు. 2వ డోస్ 5 లక్షల 75 వేల మంది వరకు వేశామని, ఈ నెలలో 1.38 లక్షలు లక్ష్యం కాగా 95 వేలు పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. 15-17 సంవత్సరాల మధ్య వయస్కులు 55201 మంది లక్ష్యం కాగా 18, 158 మందికి వ్యాక్సిన్ వేశామని చెప్పారు. వ్యాక్సినేషన్ ఎక్కువగా ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ప్రతి రోజు కోవిన్ పోర్టల్లో బూస్టర్ డోసు తీసుకోవాల్సిన జాబితా అందుబాటులో ఉంటుందని చెప్పారు. రెండవ డోస్ తీసుకున్న తదుపరి 9 నెలల దాటిన వారందరికీ బూస్టర్ డోస్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. గతంలో ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో అదే వ్యాక్సిన్ ఇపుడు తీసుకోవాల్సి ఉంటుందని, కరోనా సోకిన వ్యక్తులు పాజిటివ్ తేదీ నుండి రెండు నెలల వ్యవధి తదుపరి వ్యాక్సిన్ తీసుకోవచ్చునని చెప్పారు. రెండవ డోస్పై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని చెప్పారు. వ్యాక్సిన్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్న వైద్యాధికారులను వివరాలను అడిగి తెలుసుకుని రెండవ డోస్ తక్కువగా జరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రెండవ డోస్ వేగవంతం చేయాలని చెప్పారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాగేంద్ర ప్రసాద్, ప్రాధమిక, కమ్యూనిటి, ఏరియా, జిల్లా ఆసుపత్రి వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Share This Post