ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 59 అమలుపై అధికారుల క్షేత్ర స్థాయి సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సోమవారం తనిఖీ చేశారు.

ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 59 అమలుపై అధికారుల క్షేత్ర స్థాయి సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్థానిక జగ్జీవన్ రామ్ కాలనీ, శ్రీరాంగిరి కాలనీ, రాఘవయ్యనగర్, శ్రీరామచంద్రనగర్, కొత్తగూడెం కాలనీల్లో పర్యటించి ఆధికారులను వివరాలు ఆడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుదారుల వద్ద నున్న ఆధారాలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

కలెక్టర్ పర్యటన సందర్భంగా అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రాము, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, అధికారులు తదితరులు ఉన్నారు.

Share This Post