ప్రభుత్వ ఉద్యోగులందరికీ బదిలీలు సాధారణం, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ తనకు సోదరసమానులు : మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, మేడ్చల్ – రంగారెడ్డి జిల్లాకు అమోయ్ కుమార్ సమర్ధవంతమైన కలెక్టర్ : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్,, నూతన కలెక్టర్కు స్వాగతం – బదిలిపై వెళ్ళిన కలెక్టర్ హరీశ్కు ఆత్మీయ వీడ్కోలు సమావేశం,


ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి బదిలీలు సర్వసాధారణమని ఈ విషయంలో వారు ఏ ప్రాంతానికి బదిలీపై వెళ్ళినా తమకంటూ ఒక గుర్తింపును, మంచి పేరు సంపాదించుకోవాలని ఈ విషయంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బదిలీపై వెళ్ళిన హరీశ్ తనకు సోదర సమానులని తాము రంగారెడ్డి జిల్లాలో కలిసి పని చేశామని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నూతన కలెక్టర్ అమోయ్ కుమార్కు స్వాగతం – బదిలీపై వెళ్ళి కలెక్టర్ హరీశ్కు ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఏడాదిన్నర పాటు విధులు నిర్వహించి మరింత అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చిన ఘనత హరీశ్కు దక్కుతుందన్నారు. ఈ విషయంలో తాము రంగారెడ్డి జిల్లాలో కలిసి పని చేశామని ఆయన తెలిపారు. హరీశ్ అన్ని రంగాల్లో మంచి పట్టు, బాధ్యత కలిగిన వ్యక్తిగా పేరు సంపాదించారని ఆయన జిల్లాకు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికీ గుర్తుంటాయని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ కొనియాడారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహించిన ఆయన బదిలీపై వెళ్ళారని అయినప్పటికీ ఆయన సహకారం జిల్లాకు తీసుకొంటామన్నారు.
అనంతరం రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బదిలీపై వెళ్ళిన హరీశ్ మాట్లాడుతూ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో తాను పద్దినిమిది నెలల పాటు బాధ్యతలు నిర్వహించానని ఎంతో ఆనందంగా అందరు అధికారులతో కలిసి మెలసి పని చేసేవారమని గుర్తు చేశారు. జిల్లాలో తాను పని చేసిన సమయంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఎంతో సహకరించారని వారి సహకారం ఎప్పటికీ మరువలేనిదని హరీశ్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ధరణి, జీవో నెంబర్ 58, 59 విషయాల్లో అధికారులు ఎప్పటికప్పుడు పనులను పూర్తి చేసి ఏమాత్రం పెండింగ్ లేకుండా చేయడంలో వారి పాత్ర ఎంతో ఉందని తెలిపారు. అలాగే కరోనా సమయంలో జిల్లా స్థాయి అధికారులతో పాటు కింది స్థాయి అధికారులు, సిబ్బంది చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని సమావేశంలో హరీశ్ వివరించారు. ప్రస్తుతం జిల్లాకు కలెక్టర్గా బదిలీపై వచ్చిన అమోయ్ కుమార్ సమర్ధవంతమైన వారని ఆయన హయాంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని చెప్పడంలో ఏమాత్రం సంకోచంలేదని హరీశ్ తెలిపారు.
జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ… జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్లు రాష్ట్రంలోనే చురుకైన అధికారులుగా మంచి పేరు సంపాదించారని వీరి ఆధ్వర్యంలో రెండు జిల్లాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆకాంక్షించారు…
పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ హరీశ్ చేసిన పనులను గుర్తు చేస్తూ ఆయన సేవలను కొనియాడారు…
ఈ సందర్భంగా కీసరగుట్ట నుంచి వచ్చిన వేదపండితుల మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు అమోయ్ కుమార్, హరీశ్లను ఘనంగా పూలమాలలు, శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్,టి జి ఓ ,అధ్యక్షుడు ,డిసి ఓ ,శ్రీనివాస్ మూర్తి ట్రెస్మా జిల్లా అధ్యక్షులు గౌతమ్ కుమార్, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు , జిల్లాలోని మేయర్లు, మున్సిపల్ కమిషనర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post