ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా, నిస్వార్థంగా అంకితభావంతో పౌర సేవలందించాలని జిల్లా కలెక్టర్. వి.పి. గౌతమ్ అన్నారు.

ప్రచురణార్ధం

నవంబరు, 03, ఖమ్మం: –

ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా, నిస్వార్థంగా అంకితభావంతో పౌర సేవలందించాలని జిల్లా కలెక్టర్. వి.పి. గౌతమ్ అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగి కుటుంసభ్యులకు కల్పించిన కారుణ్య నియామకాల ఉత్తర్వులను బుదవారం కలెక్టర్ తన ఛాంబర్లో అభ్యర్థులకు అందజేశారు. ఖమ్మం. జిల్లాకు సంబంధించి ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు, 1 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను కారుణ్య నియామకం కింద చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న విద్యతో పాటు ఉద్యోగంలో చేరినతరువాత కూడా ఉన్నత విద్యనభ్యసించాలని, నూతనంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన వారందరూ నిస్వార్ధంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా తమ విధులను నిర్వర్తిస్తూ పౌరులకు మానవతా దృక్పథంతో సేవలందించాలని అభ్యర్థులకు కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం పొందినవారు తమ కుటుంబ బాధ్యతలను కూడా తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

కలెక్టరేట్ కార్యాలయ పరిపాలనాధికారి మదన్ గోపాల్, కారుణ్య నియామకము పొందిన అభ్యర్థులు: తదితరులు పాల్గొన్నారు.

Share This Post