ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటాం… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సయ్యద్ ముర్తుజా రిజ్వి

ప్రచురణార్థం

ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటాం…

మహబూబాబాద్ జూలై 8.

ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు అభివృద్ధి పనులు చేపడతామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సయ్యద్ ముర్తుజా రిజ్వి తెలిపారు.

గురువారం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ తో కలిసి ఆర్ టి పి సి ఆర్ ల్యాబ్( వైరాలజీ ల్యాబొరేటరీ), తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ లను సందర్శించి పరిశీలించారు. పైగా అధికారులతో మాట్లాడారు టెస్ట్లు మరింత పెంచాలని నిరుపేదలకు అందుబాటులోకి తేవాలని అన్నారు టెస్ట్ కు సంబంధించిన వివరాలన్నీ రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు

అనంతరం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను సందర్శించి ప్రతి వార్డు క్షుణ్నంగా పరిశీలించారు. పిల్లల సంరక్షణ విభాగం ఐసియు జనరల్ వార్డ్ లను సందర్శించి పరిశీలించారు హాస్పిటల్ జి ప్లస్ టు భవన నిర్మాణాన్ని పరిశీలిస్తూ అధికారులతో మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య సౌకర్యాలు మెరుగు పడుతున్నందున వసతులు కూడా మెరుగు పరచవలసిన అవసరం ఉందన్నారు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.

అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు హాస్పిటల్ అభివృద్ధికి చర్యలు తీసుకునేందుకు పర్యటించామని, అంచెలంచెలుగా సౌకర్యాలు కల్పిస్తామని, తప్పనిసరిగా పునరుద్ధరణ పనులు చేపడతామన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అభిషేక్ ఆగస్త్య, జిల్లా వైద్య శాఖ అధికారి హరీష్ రాజు ఏరియా హాస్పిటల్ పర్యవేక్షకులు భానోత్ వెంకటరాములు డాక్టర్ రమేష్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
———————-_—
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post