ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని వసతులు కల్పించాలి…

ప్రచురణార్థం

ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని వసతులు కల్పించాలి…

మహబూబాబాద్ డిసెంబర్ 6.
ప్రభుత్వ కార్యాలయాల్లో త్రాగునీరు మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రగతి సమావేశ మందిరంలో ప్రభుత్వ కార్యాలయాలలో కల్పిస్తున్న వసతి కల్పన లపై కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది పనితీరు పెంచేందుకు కార్యాలయాల్లో వసతి సౌకర్యాలు అవసరమని తెలియజెప్పారు.

ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రెయిలింగ్ తో కూడిన ర్యాంపు ఏర్పాటు చేయాలని అలాగే వీల్చైర్ కూడా ఏర్పాటు చేస్తూ నిర్వహణ బాధ్యతలను సూచించే వ్యక్తి పేరు కూడా ఇవ్వాలన్నారు.

ప్రతి కార్యాలయంలోనూ జాబ్ తప్పనిసరిగా ఉండి తీరాలని అదే విధంగా సమాచార హక్కు చట్టం బోర్డు కూడా ఏర్పాటు చేయాలన్నారు.

ఉత్తర ప్రత్యుత్తరాలకు ఈ- ఆఫీసు ద్వారానే జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలు వసతి గృహాలు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు అంగన్వాడి కేంద్రాలు పాఠశాలల లో పేరుకుపోయిన వృధా సామాగ్రిని తొలగించాలన్నారు అదేవిధంగా ఫైళ్ళను కూడా అవసరం వచ్చేవి మాత్రమే ఉంచాలని అవసరం లేని వాటిని తొలగించాలన్నారు అవసరం ఉన్న ఫైళ్ళను కూడా స్కానింగ్ చేసి మెయిల్ లో భద్రపరచాలి అన్నారు.

జిల్లా అధికారులందరూ ఈమెయిల్ ఐడి తప్పనిసరిగా కలిగి ఉండాలని సెల్ నెంబరు nic వారి వెబ్సైట్లో నమోదు చేయించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో ఫిర్యాదుల బాక్స్ లు ఏర్పాటు చేయాలన్నారు ప్రభుత్వ అధికారులు అందరూ ట్విట్టర్ ఎకౌంట్ కలిగి ఉండాలని తమ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా తెలియజేయాలన్నారు

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్ కొమురయ్య జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు
————————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post