ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, భూ వివరాలపై నివేదికలు అందచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్ని శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు

. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో అన్ని శాఖల జిల్లా అధికారులతో ధాన్యం తరుగు అంశం, పోడు సర్వే నిర్వహణ ప్రక్రియై అవగాహన, ప్రభుత్వ భవనాలు, భూ వివరాలు, రహదారులు వెంబడి వ్యర్థాలు తొలగింపు, వాణిజ్య ప్రాంతాల్లో వ్యర్థాలు సేకరణకు చెత్త డబ్బాలు పంపిణీ, రెండు పడక గదుల ఇండ్లు నిర్మాణానికి ఇసుక కేటాయింపులు తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్టుల పరిరక్షణలో భాగంగా నివేదిక ఇవ్వాలని చెప్పారు. తద్వారా ప్రభుత్వ కార్యాలయాల ఆస్టుల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. కొత్తగూడెం మున్సిపాల్టీలో డివైడర్లు ప్రక్కనున్న వ్యర్థాలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. పట్టణంలోని వాణిజ్య ప్రాంతాలలో వ్యర్థాలు సేకరణకు చెత్త డబ్బాలను పంపిణీ చేయాలని చెప్పారు. వ్యర్థాలు ఆరుబయట వేస్తే జరిమాన విధించాలని చెప్పారు. రెండు పడక గదల ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ ఏటను ఆదేశించారు. ఈ నెల 8వ తేదీ నుండి పోడు భూముల సర్వే నిర్వహణ చేపట్టనున్నందున మండల ప్రత్యేక అధికారులు సర్వే ప్రక్రియను పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందని, అందువల్ల సర్వేపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యంలో తరుగు చూపిన అంశంపై ప్రజావాణిలో విద్యాదలు వస్తున్నాయని, అందుకు బాధ్యులైన కొనుగోలు కేంద్రం ఇన్చార్జితో పాటు మిల్లర్లుపై చర్యలు తీసుకుంటామని, ఇష్టమొచ్చినట్లు తరుగు తీయడం అమానుషమని ఆయన పేర్కొన్నారు. ధాన్యం తరుగుపై జిల్లా సహాకార అధికారి సమగ్ర నివేదికలు అందచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్ అశోక్ చక్రవర్తి, డిఎసీఓ చంద్రప్రకాశ్, డిసిఓ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post