ప్రభుత్వ కార్యాలయాల స్థలదాతల ను అభినందించిన కలెక్టర్

ప్రచురణార్థం

ప్రభుత్వ కార్యాలయాల స్థలదాతల ను అభినందించిన కలెక్టర్.

మహబూబాబాద్ డిసెంబర్ 6.

జిల్లాలోని పెద్ద వంగర మండలం ప్రభుత్వ కార్యాలయాల కొరకు స్థలాన్ని ఇచ్చిన దాతలను జిల్లా కలెక్టర్ శశాంక అభినందించారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చి మార్కెట్ ధర ప్రకారం అత్యంత విలువ చేసే స్థలాన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇవ్వడం దాతల దాతృత్వానికి నిదర్శనమన్నారు.

సర్వేనెంబర్ 522 లో ఒక ఎకరం 20 గుంటల భూమి పత్రాలను తాసిల్దారు చేతుల మీదుగా కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీ రాజు గ్రామీణ అభివృద్ధి మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దాతలు అందజేసిన స్థలంలో తాసిల్దార్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి మండల వ్యవసాయ అధికారి ఐకెపి, ఎం జి ఎన్. ఆర్ ఈ జి ఎస్ కార్యాలయాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సరితా రాణి, కేతి రెడ్డి సోమ నరసింహారెడ్డి, జాటోత్ నెహ్రూ నాయక్, అన్నాబత్తుల ప్రభాకరరావు, అన్నా బత్తుల నాగేశ్వరరావు,పాలకుర్తి యాదగిరి రావు,ముప్పాల సురేశ్ బాబు, చెరుకు మహేశ్వర రెడ్డి, పసుపులేటి వెంకట రామయ్య తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది…

Share This Post