ప్రభుత్వ డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ విధులను అంకిత భావంతో పనిచేయాలని లేకుంటే ఉద్యోగం మానుకోవాలని లేనిపక్షంలో టర్మీనెట్ చేస్తా జిల్లా కలెక్టర్- పి. ఉదయ్ కుమార్

ప్రభుత్వ డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ విధులను అంకిత భావంతో పనిచేయాలని లేకుంటే ఉద్యోగం మానుకోవాలని లేనిపక్షంలో టర్మీనెట్ చేస్తామని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ హెచ్చరించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం అచ్ఛంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆసుపత్రిలో ప్రతి వార్డును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డెంటల్, ఆప్తల్మాలజీ విభాగంలో పరిశుభ్రత లేకపోవడం, సామాన్లు చిందరవందరగా పడివుండటాన్ని చూసిన కలెక్టర్ సంబంధిత డాక్టర్, వైద్య సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చిన రోగి కనీసం 5 నిమిషాలైన కూర్చోగలడా అని ప్రశ్నించారు. రూమ్ వెంటనె పరిశుభ్రం చేయించాల్సిందిగా ఆదేశించారు. రక్త నమూనాల సేకరణ ల్యాబ్ ను పరిశీలించిన కలెక్టర్ గర్భిణీలకు చేసిన రక్త నమూనాలు వాటి రిపోర్టులు రిజిష్టర్లో చేసిన నమోదులను పరిశీలించారు. రిజిష్టర్లో ఉన్న హిమోగ్లోబిన్ పర్సటెంజ్ కు కె.సి.ఆర్ కిట్ లో నమోదు చేస్తున్న రిపోర్టుకు తేడాలు ఉంటున్నాయని సందేహం వ్యక్తం చేశారు. ఒక సారి ఆన్లైన్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికరి ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, సి.హెచ్.సి, పల్లె దవఖాన, ఆయుర్వేద డాక్టర్లు, స్టాఫ్ నర్స్ లతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీల మొదటి ఏ.ఎన్. సి నుండి కాన్పు అయ్యే వరకు వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. రక్తహీనత ఉంటే వాటిని అధిగమించడానికి వైద్య పరీక్షలు నిర్వహించి తగు సూచనలు చేయాలన్నారు. వంద శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేవిధంగా చూడాలని ఆదేశించారు. ఒక వేళ ప్రయివేటు కు వెళ్లిన గర్భిణీలు, సిజేరియన్ ద్వారా ప్రసవాలు జరిగిన వాటి విషయంలో ఆడిట్ నిర్వహించి రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. పల్లె దవాఖానకు డాక్టర్లు సక్రమంగా వస్తున్నారా లేదా అని స్టాఫ్ నర్సుల వద్ద ఆరా తీయగా వారంలో ఒకటి రెండు రోజులు మాత్రమే వస్తున్నట్లు తెలవడం తో కలెక్టర్ మండిపడ్డారు. పల్లె దవాఖాన డాక్టర్లు, ఆయుష్ డాక్టర్లు తమ విధులను నిబద్ధతతో నిర్వర్తించాలని లేని పక్షంలో రాజీనామా చేసి వెళ్లిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేదంటే టర్మీనెట్ చేస్తానని హెచ్చరించారు. ఇక నుండి ప్రతి నెల సమీక్ష నిర్వహించడం జరుగుతుందని విధులపట్ల నిర్లక్ష్యం వహించేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. సుధాకర్ లాల్, డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ వెంకటదాస్, సి.హెచ్.సి సూపరిండెంట్, మెడికల్ ఆఫీసర్లు, ఆయుష్ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు.

Share This Post