ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి ఎన్ఎల్ఎమ్ జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ మోహనన్

ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి

ఎన్​ఎల్​ఎమ్​ జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్​ మోహనన్​

ధరణిపై జిల్లా కలెక్టర్​ను అభినందించిన ప్రత్యేక అధికారి

సోమవారం మేడ్చల్ –  మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ హరీష్ అధ్యక్షతన జిల్లాకు ప్రత్యేకంగా వచ్చిన బృందం ప్రత్యేక అధికారి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్​ మోహనన్​ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆయా రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ముఖ్య ఉద్దేశాలు, అమలు తీరు, కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను తెలుసుకొనేందుకు ప్రత్యేక అధికారులను పంపించారని ఈ మేరకు ప్రభుత్వం అందించే నిధులు ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా అమలవుతున్న వివిధ కార్యక్రమాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన విషయంలో  ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులను తెలుసుకొనేందుకు జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేస్తారని దీనికి సంబంధించి ప్రత్యేక బృందాలు జిల్లాలో పర్యటించడం జరుగుతుందని డాక్టర్​ మోహనన్​ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్​ఎల్​ఎమ్​ టీమ్​ జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిశీలించి కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆయా పథకాలకు సంబంధించి వివరాలను తెలుసుకొంటారని తెలిపారు. ఈ ప్రత్యేక అధికారుల బృందం నవంబరు 2వ తేదీ వరకు ఆయా ప్రాంతాలు, గ్రామాల్లో పర్యటించనుందని వివరించారు.  కేంద్ర ప్రభుత్వ బృందం పర్యవేక్షణకు సంబంధించిన ఏర్పాట్లను ఆయా సంబంధిత అధికారులు తమ పరిధిలో అమలవుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను తెలుసుకొంటామని డాక్టర్​ మోహనన్​ తెలిపారు. ఈ మేరకు తమ బృందంలోని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించిన వివరాలను, అందుకు సంబంధించిన పూర్తి నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందిస్తామని జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్​ మోహనన్​ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్​ హరీష్​ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రత్యేకంగా రూపొందించిన ధరణి పోర్టల్​ వివరాలను పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ద్వారా వివరించారు. దీనిని పూర్తిగా తెలుసుకొన్న కేంద్ర ప్రత్యేక అధికారి డాక్టర్​ మోహనన్​ కలెక్టర్​ హరీష్​ను ఈ విషయంపై అభినందించారు. అనంతరం జిల్లాలోని అధికారులు కేంద్ర ప్రభుత్వ అధికారులకు పూర్తి వివరాలను అందించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించిన సమయంలో సహకరించాలని అక్కడ చేపట్టిన కార్యక్రమాలను వివరించాలని కలెక్టర్​ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్​, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్​, డీఆర్​డీవో పద్మజారాణి, జడ్పీ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారితో పాటు ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎం పి ఓ లు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post