ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొత్త పోడు చేసే వారిపై కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య .

 

* ప్రచురణార్థం * ములుగు జిల్లా
నవంబర్ 20 ( శనివారం ).

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొత్త పోడు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బైండోవర్ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ముప్పన పల్లి గ్రామంలో కొత్తగా పోడు చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందని జిల్లాలో ఎక్కడైనా నూతన పోడు చేసిన,అటవి ప్లాంటేషన్ ధ్వంసం చేస్తే కట్టిన చర్యలు తప్పవని, వారిపై అటవీ చట్టాలు ఇండియన్ ఫారెస్ట్ రైట్ యాక్ట్, ,వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ యాక్ట్, ఐ పి సి సి ఆర్ యాక్ట్ ల ,ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరితుందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

 

అడవులను నరికి వేతకు పాల్పడే వ్యక్తులను ఏ మాత్రం ఉపేక్షించేదు
లేదని, బైండోవర్ చేయడం జరుగుతుందని ఇట్టి విషయం పై ప్రజలు గమనించగలరని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పోడు భూముల సమస్య పై సలహాలు, పిర్యాదుల కొరకు టోల్ ఫీ.నెంబర్ -1800-425-0520** ను సంప్రదించగలరని సూచించారు.

Share This Post