ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేఅవుట్ వెంచర్స్ డెవలప్ చెయ్యాలి

ప్రచురణార్థం

ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేఅవుట్ వెంచర్స్ డెవలప్ చెయ్యాలి

మహబూబాబాద్, నవంబర్-30:

ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేఅవుట్ వెంచర్స్ ను డెవలప్ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం అదనపు కలెక్టర్ మహబూబాబాద్ మునిసిపాలిటి లోని అనంతారమ్, ఈదులపూసపల్లి లొ ఉన్న వెంచర్స్ ను తనిఖీ చేశారు. లేఅవుట్ డెవలపర్స్ ప్రభుత్వ నిబంధన ప్రకారం డెవలప్ చేసి ప్లాట్లను అమ్మాలని, నిబంధనలకు విరుద్ధంగా వెంచర్స్ ను ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

లే అవుట్ వెంచర్స్ అన్నింటిని కూడా తనిఖీ చేసి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేవో అని చూడవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వెంచర్ లలో ప్లాట్లు కొని మోసపోవద్దని, ప్లాట్లు కొనేముందు అన్ని రకాల అనుమతులు ఉన్నాయి అని చూసిన తర్వాతనె కొనుగోలు చేయాలని సూచించారు.

—————————————————————————————————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్ కార్యాలయంచే జారీ చేయనైనది.

Share This Post