పత్రికా ప్రకటన తేది: 07-12-20 22
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన నిరుపేదలను గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ చాంబర్ లో గద్వాల, గోనుపాడు, క్యాథూర్లలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు, లబ్ధిదారుల కేటాయింపు పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్యాతూర్, గోనుపాడు, గద్వాలలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు అర్హులైన నిరుపేదలను తాసిల్దారులు, మున్సిపల్ కమిషనర్లు గుర్తించాలన్నారు. గోనుపాడు, క్యాతూరు గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి, అర్హులైన జాబితాను సభలో ఉంచాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తాసిల్దారులు, గ్రామపంచాయతీ పరిధిలో భూమి, ప్రభుత్వ ఉద్యోగం, ఫోర్ వీలర్ లాంటివి ఉంటే అట్టివారిని తొలగించాలన్నారు. పూర్తిగా ఇల్లు లేని వారు, పేదరికంలో ఉన్న వారిని గుర్తించి జాబితా తయారు చేయాలన్నారు. గద్వాల మున్సిపాలిటీ పరిధిలో పది టీములను రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి అర్హులను గుర్తించాలన్నారు. వీటిలో 50 శాతం ఎస్సీ ,ఎస్టీలకు కేటాయిస్తునట్లు కలెక్టర్ తెలిపారు. వీలైనంత త్వరగా జాబితా తయారు చేయాలని ,లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని అన్నారు. గద్వాలలో 560 ఇళ్లు పూర్తి అయ్యాయని, 7 15 ఇండ్ల కు పనులు జరుగుతున్నాయని , 3916 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో అసలైన అర్హులు ఎవరో తాసిల్దార్, మునిసిపాలిటీ అధికారులు గుర్తించి రెండు వారాలలో జాబితా ఇవ్వాలన్నారు. అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో గద్వాల ఇళ్ల జాబితా చర్యలు తీసుకోవాలన్నారు. గోనుపాడు లో నిర్మించిన ఇళ్ళ, కొంతమంది అభ్యంతరం చెబుతున్నారని సర్పంచ్ కలెక్టర్కు తెలిపారు. 2019లో నిర్మించినందున కిటికీలు, డోర్లు దెబ్బతిన్నాయని, ఇళ్ల ఆవరణ పరిశుభ్రం చేసి మరమ్మత్తుల అనంతరం లబ్ధిదారులను గుర్తించి అందజేయాలని కలెక్టర్ తెలిపారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, ఆర్డీవో రాములు, పి ఆర్ ఈ ఈ శివశంకర్, రవీందర్, ఎంపీడీవోలు ,గద్వాల్ ఎం ఆర్ ఓ వెంకటేశ్వర్లు, సూపర్ ఇంటెండెంట్ రాజు ,క్యాతూరు సర్పంచి సుశీలమ్మ, గోనుపాడు సర్పంచ్ మజీద్, తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాలచే జారీ చేయబడినది