ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి పోడు భూముల పట్టాలను ఇవ్వటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు తెలిపారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి పోడు భూముల పట్టాలను ఇవ్వటం జరుగుతుందని జిల్లా కలెక్టర్
ఎస్. వెంకటరావు తెలిపారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పోడు భూముల పై నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో పోడు భూముల పట్టాలకు వచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో కలిసి అన్ని దరఖాస్తులను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న దరఖాస్తుల దారులకు పోడు భూముల పట్టాలు ఇవ్వటం జరుగుతుందని వెల్లడించారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, రెవెన్యూ అధనపు కలెక్టర్ కె .సీతారామారావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిని చత్రునాయక్, డి ఎఫ్ఓ సత్యనారాయణ, ఆర్డిఓ అనిల్ కుమార్, హన్వాడ జెడ్పిటిసి విజయనిర్మల, రాజాపూర్ జెడ్పిటిసి మోహన్ నాయక్, తదితరులు హాజరయ్యారు.

 

Share This Post