ప్రభుత్వ నిబంధనల మేరకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

ఈ నెల 15వ తేదీన దేశ వ్యాప్తంగా జరుగనున్న 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు నిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన నమావేశ మందిరంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై ఏర్పాటు చేసిన నమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మధునూదన్‌నాయక్‌తో కలిని జిల్లా అధికారులతో నమీక్ష నిర్వహించారు. ఈ నందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నంబంధిత శాఖల అధికారులు పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా నిద్దంగా ఉండాలని, గతంలో జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో వేడుకలు నిర్వహించడం జరిగిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పతాక ఆవిష్కరణ అనంతరం పోలీన్‌ పరేడ్‌ గౌరవ వదనం, పలు సాంన్ఫ్కతిక కార్యక్రమాలు, శకటాలు, వివిధ నంక్షేమ శాఖల ద్వారా ప్రభుత్వ నంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఎగ్జిబిషన్‌ ఏర్పాట్లు, విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన వారి ఒకటి లేదా రెండు పేర్లు నంబంధిత శాఖల అధికారులు పంపించాలని తెలిపారు. రాష్ట్రంలో ప్రజల్లో దాగి ఉన్న నృజనాత్మకను వెలికితీసే విధంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇంటింటా ఇన్నోవేషన్‌ కార్యక్రమంలో భాగంగా నూచించిన అంశాలపై ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసేందుకు నిద్దంగా ఉండాలని నంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పొర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post